Begin typing your search above and press return to search.

2 గంట‌ల్లోనే పాట రాసి రికార్డింగ్ పూర్తి చేసిన హీరో!

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ మ‌ల్టీట్యాలెంటెడ్ అన్న‌సంగ‌తి తెలిసిందే. గొప్ప న‌టుడే కాదు.

By:  Tupaki Desk   |   29 April 2024 7:54 AM GMT
2 గంట‌ల్లోనే పాట రాసి రికార్డింగ్ పూర్తి చేసిన హీరో!
X

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ మ‌ల్టీట్యాలెంటెడ్ అన్న‌సంగ‌తి తెలిసిందే. గొప్ప న‌టుడే కాదు. అంత‌కు మించి గొప్ప ర‌చ‌యిత కూడా. క‌థ‌లు రాస్తారు..పాట‌లు ర‌చిస్తారు. వాటిని పాడ‌తారు. డైలాగులు రాసేస్తారు. కొరియోగ్ర‌ఫీ చేస్తారు. ఇలా క‌మ‌ల్ అన్నింటా స‌త్తా చాటిన వారే. ప్ర‌స్తుతం మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో `థ‌గ్ లైఫ్` లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం కూడా క‌మ‌ల్ క‌లం ప‌ట్టారు. మ‌ణిర్న‌తంతో క‌లిసి స్టోరీ సిద్దం చేసారు. తాజాగా ఈ సినిమాకి గీత ర‌చ‌యిత‌గానూ మారిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆయ‌న ఓ పాట రాసారు.

ఇక్క‌డ పాట రాయ‌డం విశేషం కాదు. ఆ పాట‌ను రెండు గంట‌ల్లో రాసి...రికార్డింగ్ కూడా పూర్తి చేయ‌డం సంచ‌ల‌నం. అవును ఇదంతా క‌మల్ రెండు గంట‌ల్లోనే పూర్తి చేసారు. ఇంత‌వ‌ర‌కూ క‌మ‌ల్ కెరీర్ లో ఇలాంటి రికార్డు లేదు. ఎన్నో సినిమాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసారు. ఏ సినిమా కోసం ఇంత వేగంగా ప‌నిచేయ‌లేదు. దీంతో ఇదో రికార్డుగా మారింది. క‌మ‌ల్ కి మ‌ణిర‌త్నంతో మంచి అండ‌ర్ స్టాడింగ్ కూడా ఉంటుంది. అందుకే `నాయ‌కుడు` లాంటి గొప్ప సినిమాని ప్రేక్ష‌కుల‌కు అందివ్వ‌గ‌లిగారు.

ఆ త‌ర్వాత‌ ఇద్ద‌రూ క‌లిసి ప‌ని చేయ‌డానికి మూడు ద‌శాబ్ధాల‌కుపైగా స‌మ‌యం ప‌డుతుంది. ప్ర‌స్తుతం ఇద్ద‌రు `థ‌గ్ లైఫ్` ని పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. పాన్ ఇండియాలో ఈ సినిమా సంచ‌ల‌న మ‌వుతుంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు మంచి హైప్ ని తీసుకొచ్చాయి. 70 ఏళ్ల వ‌య‌సులోనూ క‌మల్ ఎక్క‌డా కింగ లేదు. అదే జోష్ తో ప‌నిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని క‌మ‌ల్ త‌న సొంత నిర్మాణ సంస్థ రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింస్ పైనే నిర్మిస్తున్నారు.

ఇదే సంస్థ‌లో ఇత‌ర హీరోల‌తో క‌మ‌ల్ సినిమాలు నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `విక్ర‌మ్` త‌ర్వాత సొంత బ్యాన‌ర్ లో సినిమాల వేగం పెంచారు. టాలీవుడ్ స్టార్ హీరోల‌తోనూ సినిమాలు చేసే ఆలోచ‌న‌లో క‌నిపిస్తున్నారు. ఇప్ప‌టికే ఇత‌ర స్టార్ హీరోల‌తోనూ భాగ‌మ‌వ్వ‌డం మొద‌లైంది. ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `కల్కీ 2898` లో కీల‌క పాత్ర పోషిస్తోన్న సంగ‌తి తెలిసిందే.