Begin typing your search above and press return to search.

ఆ హీరో పోవడంతో మంచే జరిగింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ విక్రమ్‌ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలను కమిట్ అయ్యాడు.

By:  Tupaki Desk   |   13 April 2024 7:30 AM GMT
ఆ హీరో పోవడంతో మంచే జరిగింది
X

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ విక్రమ్‌ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలను కమిట్ అయ్యాడు. అందులో ఒకటి థగ్ లైఫ్‌. లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై తమిళ ప్రేక్షకుల్లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.


మూడు దశాబ్దాల తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా అనగానే అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. సినిమాను భారీ స్టార్ కాస్టింగ్‌ తో రూపొందిస్తున్నాం.. సినిమాలో కమల్‌ ను కొత్తగా చూపించబోతున్నాం అంటూ మేకర్స్ చేసిన ప్రకటనతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

ఇలాంటి సమయంలో సినిమా నుంచి మలయాళ స్టార్‌ హీరో దుల్కర్ సల్మాన్‌ తప్పుకోవడం, మరో వైపు కీలక పాత్ర కోసం ఎంపిక అయిన జయం రవి కూడా తప్పుకోవడం వంటి కారణాల వల్ల సినిమా విషయంలో అనుమానాలు మొదలు అయ్యాయి.

దుల్కర్‌ సల్మాన్ తప్పుకోవడంతో ఆ స్థానం ను తమిళ స్టార్‌ హీరో శింబు భర్తీ చేయబోతున్నాడు అనే వార్త ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆనందంను నింపుతోంది. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు ఈ సినిమా నుంచి దుల్కర్‌ సల్మాన్‌ తప్పుకుని శింబు రావడం మరింత మంచి పరిణామం అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉన్నారు.

శింబుకు తమిళనాట మంచి ఫాలోయింగ్ ఉంది. కనుక అక్కడ థగ్‌ లైఫ్‌ సినిమాకు మరింత క్రేజ్ పెరగడం ఖాయం. అయితే మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌ వల్ల మంచి బిజినెస్ ఉండేది. ఆయన తప్పుకోవడం వల్ల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. జయం రవి ప్లేస్ లో ఎవరు వస్తారు అనేది చూడాలి.