Begin typing your search above and press return to search.

కమల్ - మణిరత్నం.. పెద్ద ప్లానే!

ఈ సినిమాకి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ మూవీలో కమల్ హాసన్ తో పాటు, చాలా మంది సౌత్ స్టార్స్ కూడా ఉండబోతున్నారట.

By:  Tupaki Desk   |   12 Sept 2023 5:52 PM IST
కమల్  - మణిరత్నం.. పెద్ద ప్లానే!
X

విలక్షణ నటుడు కమల్ హాసన్ చివరగా విక్రమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసుని షేక్ చేసింది. కమల్ హాసన్ ని డైరెక్టర్ చూపించిన విధానానికి, ఈ మూవీ కథకు అందరూ ఫిదా అయిపోయారు. అన్ని భాషల్లోనూ ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. అయితే, ఈ మూవీ తర్వాత కమల్ ఎలాంటి సినిమాతో వస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈక్రమంలో కమల్ కొత్త సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దాని ప్రకారం, కమల్ కొత్త సినిమా KH234 మరింత అదరిపోయేలా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ మూవీలో కమల్ హాసన్ తో పాటు, చాలా మంది సౌత్ స్టార్స్ కూడా ఉండబోతున్నారట.

స్టార్ హీరోయిన్ త్రిష, జయం రవి, పాన్ ఇండియా హీరో దుల్కర్ సల్మాన్ లాంటివారు ఈ సినిమాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ సినిమాలోనూ కమల్ తనతో పాటు ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి లాంటివారికి కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు కమల్ కొత్త సినిమాలో మరి కొందరు పాన్ ఇండియా స్టార్స్ నటించనున్నారని తెలుస్తోంది.

ఈ మూవీ కూడా పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారట. వీరు మాత్రమే కాకుండా, మరి కొందరు స్టార్స్ ని కూడా సెలక్ట్ చేయనున్నారట. ఇప్పటికే, ఎంపిక చేసిన నటులుకు మణిరత్నం కథను వినిపించారని, వారు కూడా మూవీ చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

పొన్నియన్ సెల్వన్ లాంటి బిగ్ ప్రాజెక్ట్ తర్వాత మణిరత్నం తీస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. వర్కింగ్ టైటిల్ గా KH234 గా పిలుస్తున్నారు. ఈ మూవీని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ , మద్రాస్ టాకీస్ బ్యానర్ పై నిర్మించనున్నారు. కమల్ హాసన్, మణిరత్నం, జి మహేంద్రన్, శివ అనంత్ ఈ మూవీకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా, నాయకుడు సినిమా తర్వాత అంటే దాదాపు 36ఏళ్ల తర్వాత కమల్ , మణిరత్నంతో ఈ సినిమా కోసం పని చేస్తుండటం విశేషం.