Begin typing your search above and press return to search.

కల్కి కమల్ కి ఎంత ముట్టచెప్పారు..?

రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న కల్కి 2898 AD సినిమాలో కాస్టింగ్ మాత్రం చాలా భారీగా ఉంది

By:  Tupaki Desk   |   22 Feb 2024 11:30 PM GMT
కల్కి కమల్ కి ఎంత ముట్టచెప్పారు..?
X

రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న కల్కి 2898 AD సినిమాలో కాస్టింగ్ మాత్రం చాలా భారీగా ఉంది. సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనెని హీరోయిన్ గా ఫిక్స్ చేయగా అమితాబ్ బచ్చన్, దిశా పటాని కూడా సినిమాలో ఉండనున్నారు. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కమల్ హాసన్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. సినిమాలో కమల్ హాసన్ ఎంట్రీ కల్కి పై మరింత బజ్ పెరిగేలా చేసింది.

లోకనాయకుడు కమల్ హాసన్ కల్కి సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ప్రభాస్, కమల్ ఆన్ స్క్రీన్ ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలిచేలా ఉంది. ఇంతకీ కమల్ హాసన్ ఈ సినిమాలో నటించేందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు..? 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి సినిమాలో కమల్ కి ఎంత పారితోషికం తీసుకున్నారు అన్నది ఆడియన్స్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

కల్కి 2898 AD సినిమాలో కమల్ పాత్ర కూడా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని తెలుస్తుంది. సినిమాలో నటించినందుకు గాను కమల్ కి కూడా భారీగా రెమ్యునరేషన్ ఇచ్చారట. సినిమాలో కమల్ ఉండటం వల్ల సినిమాకు అనుకున్న దాని కన్నా ఎక్కువ బజ్ వస్తుంది. కల్కి సినిమాలో కమల్ హాసన్ కు 60 నుంచి 70 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందించారని తెలుస్తుంది.

సినిమాకు ప్రభాస్ 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్. ప్రభాస్ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా కమల్ హాసన్ రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తుంది. ప్రభాస్, కమల్ హాసన్ ఇద్దరు కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సినిమా బడ్జెట్ లో రెమ్యునరేషన్ లకే సగానికి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. కల్కి మే 9న రిలీజ్ లాక్ చేశారు. రిలీజ్ అనుకున్న టైం కు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నారు చిత్ర యూనిట్.

కల్కి సినిమాను నాగ్ అశ్విన్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మే లో మొదటి పార్ట్ రిలీజ్ అవుతుండగా సెకండ్ పార్ట్ కోసం మరో ఏడాది పాటు టైం పడుతుందని తెలుస్తుంది. హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సినిమాను ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా కూడా భారీ రిలీజ్ ఫిక్స్ చేస్తున్నారని తెలుస్తుంది.