Begin typing your search above and press return to search.

కమల్ తో కమల్ ఫైట్ తప్పదా..?

అయితే మే 9న కల్కి 2898 AD రిలీజ్ లాక్ చేశారు కాబట్టి ఆ డేట్ న ఇండియన్ 2 రాకపోవచ్చు కానీ వారం ముందొచ్చినా వారం తర్వాత వచ్చినా కమల్ సినిమాతో కమల్ కి గట్టి పోటీనే అని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   27 Feb 2024 6:06 PM GMT
కమల్ తో కమల్ ఫైట్ తప్పదా..?
X

విక్రమ్ సినిమాతో చాలా కాలం తర్వాత తిరిగి సూపర్ ఫాంలోకి వచ్చిన కమల్ హాసన్ ప్రస్తుతం రెండు భారీ సినిమాలతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందులో ఒకటి కథానాయకుడిగా చేస్తుంటే.. మరో సినిమా ప్రతినాయకుడిగా చేస్తున్నారు. కమల్ హాసన్ లీడ్ రోల్ లో పాతికేళ్ల క్రితం వచ్చి హిట్ అందుకున్న ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 వస్తుంది. సీక్వెల్ పై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా చేస్తున్నారు దర్శకుడు శంకర్.

ఎప్పుడు ఐదేళ్ల క్రితం మొదలైన ఇండియన్ 2 సినిమా మధ్యలో ఆగిపోయిందని అనుకోగా విక్రం హిట్ తో మళ్లీ దాన్ని లైన్ లోకి తెచ్చారు. ఇండియన్ 2 సినిమా పై ఉన్న అంచనాలకు ఈ సినిమాను శంకర్ అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ తో పాటుగా సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. మే నెలలో ఇండియన్ 2 రిలీజ్ ఉంటుందని టాక్.

ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా చేస్తున్న కల్కి సినిమాలో కమల్ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా మే 9న రిలీజ్ ఫిక్స్ చేశారు. కమల్ నటించిన రెండు సినిమాలు మే లో రిలీజ్ అవ్వడం ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. అయితే మే 9న కల్కి 2898 AD రిలీజ్ లాక్ చేశారు కాబట్టి ఆ డేట్ న ఇండియన్ 2 రాకపోవచ్చు కానీ వారం ముందొచ్చినా వారం తర్వాత వచ్చినా కమల్ సినిమాతో కమల్ కి గట్టి పోటీనే అని చెప్పొచ్చు. ఇండియన్ 2 రిలీజ్ డేట్ తెలిస్తే కానీ ఈ కన్ ఫ్యూజన్ కి క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

కల్కి, ఇండియన్ 2 రెండు సినిమాలకు అసలు ఏమాత్రం సంబంధం లేదు. అంతేకాదు వేటికవే ప్రత్యేకమైన సినిమాలుగా వస్తున్నాయి. వీటి మధ్య పోటీ ఉంటుందని అనుకోలేం కానీ కమల్ హాసన్ ఈ రెండు సినిమాల్లో నటించడం వల్ల తన సినిమాతో తనే పోటీ పడే అవకాశం ఉందని చెప్పొచ్చు. దీనిపై క్లారిటీ రావాలంటే ఇండియన్ 2 రిలీజ్ డేట్ అఫీషియల్ గా రావాల్సి ఉంటుంది.