Begin typing your search above and press return to search.

ఆ రోజుల్లోనే క‌మ‌ల్‌హాస‌న్ సృష్టించిన సీన్?

దీనిని రెండు ద‌శాబ్ధాల‌ క్రిత‌మే విశ్వ‌న‌టుడు, ఆల్ రౌండ‌ర్ క‌మ‌ల్ హాస‌న్ త‌న సినిమా 'అభ‌య్'(అల‌వంధ‌న్ -త‌మిళం)లో చూపించాడు. 23

By:  Tupaki Desk   |   11 April 2024 6:54 AM GMT
ఆ రోజుల్లోనే క‌మ‌ల్‌హాస‌న్ సృష్టించిన సీన్?
X

జాక్విన్ ఫోనిక్స్ న‌టించిన 'జోక‌ర్' ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. సినిమా ఆద్యంతం ఎమోష‌న్ ని ర‌గిలించే అద్భుత న‌ట‌న‌, హావభావాలతో ఫోనిక్స్ న‌ట‌న‌కు కొత్త అర్థం చెప్పాడు. ది డార్క్ నైట్‌లోని జోక‌ర్ పాత్ర‌కు కొన‌సాగింపుగా మ‌రింత విల‌క్ష‌ణంగా జోక‌ర్ సినిమాలో న‌టించి చూప‌డంతో జాక్విన్ ఫోనిక్స్ పేరు మార్మోగిపోయింది. జీవితంలోని అన్ని ఉద్వేగాల‌ను అన్ని షేడ్స్ ని ఈ పాత్ర‌లో చూపించేందుకు అత‌డికి ఆస్కారం దొరికడంతో చెల‌రేగిపోయ‌డు.

ఇప్పుడు జోక‌ర్ 2 విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సినిమాలోను జాక్విన్ ఫోనిక్స్ మ‌రోసారి చెల‌రేగి న‌టించారు. అత‌డితో పాటు ఈ సీక్వెల్ల్ లేడీ గాగ లాంటి లైవ్ వైర్ యాడ‌వ్వ‌డంతో ర‌చ్చ మ‌రో లెవ‌ల్ కి చేరుకుంది. తాజాగా రిలీజైన ట్రైల‌ర్ లో జాక్విన్- లేడీ గాగా పోటీప‌డి న‌టించారని కితాబు ద‌క్కింది. జోక‌ర్ 2 ట్రైల‌ర్ వేగంగా ఆన్ లైన్ లో దూసుకుపోతోంది.

ఇదిలా ఉండ‌గానే, ఈ సినిమాలో మిర్ర‌ర్ షాట్ గురించి క‌మ‌ల్ హాస‌న్ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. నిజానికి జోక‌ర్ 2లో చూపించిన ఈ మిర్ర‌ర్ షాట్ ఇప్పుడే కొత్త‌ది కాదు. దీనిని రెండు ద‌శాబ్ధాల‌ క్రిత‌మే విశ్వ‌న‌టుడు, ఆల్ రౌండ‌ర్ క‌మ‌ల్ హాస‌న్ త‌న సినిమా 'అభ‌య్'(అల‌వంధ‌న్ -త‌మిళం)లో చూపించాడు. 23 ఏళ్ల క్రితం తెర‌కెక్కిన చిత్ర‌మిది. అద్దంలో త‌న‌ను తాను చూసుకుని కుమిలిపోయేవాడిగా క‌మ‌ల్ హాస‌న్ క‌నిపిస్తాడు. అత‌డి ముఖం ర‌క్తంతో సింధూరంగా మారుతున్న దృశ్యం అద్దంలో క‌నిపిస్తుంది.

ఇప్పుడు జాక్విన్ ఫోనిక్స్ పైనా జోక‌ర్ 2 లో ఇలాంటి మిర్ర‌ర్ షాట్ ఒక‌టి చూపించారు. ఇందులో జాక్విన్ నిర్వేదంతో కూడిన న‌వ్వును క‌న‌బ‌రుస్తున్నాడు. సింధూరం అత‌డి న‌వ్వు ముఖంలో ఇమిడిపోతుంది! అయితే ఇలాంటి ప్ర‌యోగాల‌కు ఎప్పుడూ క‌మ‌ల్ హాస‌న్ లాంటి గొప్ప టెక్నీషియ‌న్ వెన‌కాడ‌లేదు. తన సినిమాల్లో ఇంకా ఎన్నో గొప్ప ప్రయోగాలు ఆయ‌న చేసి చూపించారు. ప‌ది పాత్ర‌ల‌తో ద‌శావ‌తారం లాంటి బారీ ప్ర‌యోగాన్ని ప్ర‌పంచంలో ఇంకెవ‌ర‌కూ చేయ‌లేక‌పోయారు.. అది క‌మ‌ల్ కే సాధ్య‌మైన విద్య‌. క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌స్తుతం 'క‌ల్కి' (ప్ర‌భాస్ క‌థానాయ‌కుడు) లాంటి భారీ పాన్ వ‌ర‌ల్డ్ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో 'భార‌తీయుడు 2'లోను న‌టిస్తున్నారు. ఈ రెండు సినిమాల రాక కోసం అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాసేలా వేచి చూస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల‌తో క‌మ‌ల్ ర‌క్తి క‌ట్టించ‌నున్నారు.