Begin typing your search above and press return to search.

కమల్ హాసన్ అంటే ఆ మాత్రం ఉంటది.. బచ్చన్ సాబ్ ఫిదా

ప్రభాస్ చేస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం

By:  Tupaki Desk   |   21 July 2023 8:56 AM GMT
కమల్ హాసన్ అంటే ఆ మాత్రం ఉంటది.. బచ్చన్ సాబ్ ఫిదా
X

ప్రభాస్ చేస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్ కె. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దాదాపు రూ.500కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వైజయంతి బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ప్రాజెక్ట్ కె సినిమా అంత‌ర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మ‌క‌మైన 'శాన్ డియాగో కామిక్ కాన్‌' ఈవెంట్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాకి సినిమా కల్కి 2898 ఏడీ అనే నామకరణం చేశారు.

ఈ ఈవెంట్ లో ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్, కమల్ హాసన్ వంటి వారు పాల్గొన్నారు. అయితే, ఈ ఈవెంట్ కి అమితాబ్ హాజరుకాలేదు. కానీ, ఆన్ లైన్ లో హాజరయ్యారు. ఈ సందర్భంగా అమితాబ్, కమల్ హాసన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ముందుగా, కమల్ మాట్లాడుతూ, అమితాబచ్చన్ చాలా ఎనర్జీగా ఈ మూవీలో నటించారని పేర్కొన్నారు.

దానికి వెంటనే అమితాబచ్చన్ స్పందించారు. కమల్ నువ్వు అంత చాలా సింపుల్ గా ఉండకు, నువ్వు అంతకంటే గొప్ప నటుడివి అంటూ ప్రశంసలు కురిపించారు. కమల్ ప్రతి సినిమా రియాల్టీగా ఉంటుందని, ప్రతి సినిమాకి చాలా ఎఫర్ట్ పెడతాడని ప్రశంసించారు. కమల్ పోషించిన పాత్రలు అద్భుతంగా ఉంటాయన్నారు. అతడు ఉన్న సినిమాలో నటించడం గౌరవంగా ఉందని బిగ్ బి పేర్కొన్నారు. తామిద్దరం గతంలో కూడా ఓ సినిమా చేశామని, కానీ ఇది చాలా స్పెషల్ అని పేర్కొన్నారు.

అమితాబ్ ప్రశంసలకు కమల్ మనస్ఫూర్తిగా నవ్వుతూ స్పందించారు. షోలే సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను అని చెప్పారు. ఆ సినిమా చూసిన తర్వాత తాను అసలు నిద్రపోలేదు అని చెప్పారు.

ఓ గొప్ప ఫిల్మ్ మేకర్ తో కలిసి పని చేసే అవకాశం తనకు దక్కిందన్నారు. ఓ టెక్నీషియన్ గా ఆ రోజు రాత్రి తాను అసలు నిద్రపోలేదన్నారు. అమిత్ జీ అలాంటి ఎన్నో సినిమాలు చేశారని. తన సినిమాల గురించి ఆయన చెప్పడం తనకు చాలా గొప్పగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, ఈ మూవీ లో ప్రభాస్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ, ఒక్కసారి మూవీ గ్లింప్స్ చూసిన తర్వాత అందరూ నోరెళ్లపెట్టారు. సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు.