Begin typing your search above and press return to search.

చెన్నైలో కమల్ హాసన్‌ని ఎక్కడ కల‌వాలి?

నిజానికి క‌మ‌ల్ హాస‌న్ చెన్నై అల్వార్‌పేట్‌లోని తన రాజభవన గృహంలో అతడు షూటింగ్ లేని సమయంలో ఎక్కువగా నివాసం ఉంటాడు.

By:  Tupaki Desk   |   21 Feb 2024 9:30 AM GMT
చెన్నైలో కమల్ హాసన్‌ని ఎక్కడ కల‌వాలి?
X

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌తిభావంతులు ఉన్నారు. ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లు, నిర్మాత‌లు త‌మ ఫేవ‌రెట్ స్టార్ల‌తో క‌లిసి ప‌ని చేయాల‌ని అనుకుంటారు. కానీ క‌మ్యూనికేష‌న్ కొంత ఇబ్బందిక‌రం. కానీ ప్ర‌య‌త్నిస్తే ఏదీ అసాధ్యం కాదు. ఒక‌వేళ విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కి క‌థ వినిపించాలంటే.. సినిమా తీయాలంటే అత‌డిని క‌ల‌వ‌డం ఎలా? ఆన్ లైన్ లో సందేహం వెలిబుచ్చిన ఒక రైట‌ర్ కి దొరికిన స‌మాధానం ఇలా ఉంది.

కమల్ హాసన్ .. ప్ర‌స్తుతం క్ష‌ణం తీరిక లేని సీనియ‌ర్ స్టార్ల‌లో ఒక‌రు. `విక్ర‌మ్` సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించాక‌ అత‌డిని క్యాచ్ చేయాలంటే చాలా క‌ష్టంగా మారిందని తెలుస్తోంది. అత‌డు ఇప్ప‌టికిప్పుడు ఇటు తెలుగులో ప్ర‌భాస్ తో క‌లిసి క‌ల్కి (ప్రాజెక్ట్ కే) లాంటి భారీ చిత్రంలో న‌టిస్తున్నాడు. మ‌రోవైపు త‌మిళ చిత్రాలు, సినిమాల నిర్మాణంతో బిజీగా ఉన్నాడు. టీవీ రియాలిటీ షోలతోను బిజీ.

నిజానికి క‌మ‌ల్ హాస‌న్ చెన్నై అల్వార్‌పేట్‌లోని తన రాజభవన గృహంలో అతడు షూటింగ్ లేని సమయంలో ఎక్కువగా నివాసం ఉంటాడు. ఈ ఇల్లు సొంత‌ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌కు కార్యాలయం కూడా. క‌మ‌ల్ రాజకీయ పార్టీ `మక్కల్ నీది మయ్యమ్‌`కు ప్రధాన కార్యాలయంగా కూడా పనిచేస్తుంది.

ఒక‌వేళ ఆయ‌న బుల్లితెర రియాలిటీ షో `బిగ్ బాస్` సీజన్‌లో ఉంటే, అతడు తన పోర్షన్‌లను షూట్ చేయడానికి తరచుగా చెంబరంబాక్కం EVP ఫిల్మ్ సిటీని సందర్శిస్తారు. ఇది కాకుండా చెన్నైలోని ఒక‌ రెసిడెన్షియల్ సొసైటీలలో కమల్‌ని అతని సూపర్ ఫ్లాంబాయింట్ అపార్ట్‌మెంట్‌లలో క‌ల‌వొచ్చు. అయితే క‌మ‌ల్‌ని అపార్ట్‌మెంట్‌లలో కలిసే అవకాశాలు ప‌రిచ‌య‌స్తులు లేకుండా క‌ష్టం. కానీ అక్క‌డ అత‌డు ఎక్క‌డికి వెళుతున్నాడో వివ‌రాలు సంపాదించ‌గ‌ల‌రు.

కనీసం ఎవరైనా పార్టీ కార్యకర్తగా లేదా చేతిలో వినతిపత్రం పట్టుకుని MNM సానుభూతిపరుడిగా ఆళ్వార్‌పేటలోని ఆయన నివాసానికి చేరుకునే ప్రయత్నం చేయవచ్చు. ఈ ప్రదేశాలు కాకుండా మీరు కమల్ హాస‌న్ రెగ్యుల‌ర్ డే టు డే షెడ్యూల్ గురించి తెలుసుకుంటే క‌లిసేందుకు ప‌ని సులువు అవుతుంది. అత‌డిని రెగ్యుల‌ర్ గా విమానాశ్రయంలోను చూడవచ్చు. చాలా మంది నటీనటులు నిరంత‌రం ప్రయాణాల్లో ఉంటారు గ‌నుక ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో అతన్ని కలవడం దాదాపు అసాధ్యం. క‌లిసినా కానీ సెలబ్రిటీలు అలాంటి ప్రదేశాలలో అపాయింట్‌మెంట్‌లు ఇవ్వరు. మీరు అదృష్టవంతులైతే సెల్ఫీ కోసం పోజులిచ్చి అతడితో కరచాలనం చేయడం ఒక్క‌టే మీరు చేయగలిగేది.

చెన్నైలో కమల్ కనువిందు చేయబోయే ప్రదేశాలు ఇంకా ఏవి? అంటే... ఆయ‌న‌ సన్నిహిత మిత్రుడు- క్రేజీ మోహన్ ఒక ఆధారం. అత‌డి ఇంటికి క‌మ‌ల్ హాస‌న్ త‌ర‌చుగా వెళుతుంటాడు. కమల్ ఇటీవ‌ల త‌న‌ ఇంటిని సందర్శించడం మానేశాడు. ఇప్పుడు సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం తమిళనాడు వెలుపల జరుగుతుండటంతో అత‌డు ఎవ‌రికీ చిక్క‌డం లేదు. క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెలు కూడా అత‌డికి దూరంగానే నివ‌శిస్తున్నారు గ‌నుక వారి ద్వారా అయినా వెంట‌నే క‌ల‌వ‌డం కుద‌ర‌దు. దానికి చాలా ప్ర‌య‌త్నించాలి.