Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ హాస‌న్ కూడా ప్ర‌భాస్ టైపే!

టాలీవుడ్ లో నాన్ వెజ్ ప్రియుడు ఎవ‌రు అంటే అంద‌ర‌కీ ఠక్కున గుర్తొచ్చేది డార్లింగ్ ప్ర‌భాస్. ముక్క లేనిదే ముద్దు దిగ‌దు అని ఓపెన్ గానే చెప్పారు

By:  Tupaki Desk   |   7 April 2024 6:38 AM GMT
క‌మ‌ల్ హాస‌న్ కూడా ప్ర‌భాస్ టైపే!
X

టాలీవుడ్ లో నాన్ వెజ్ ప్రియుడు ఎవ‌రు అంటే అంద‌ర‌కీ ఠక్కున గుర్తొచ్చేది డార్లింగ్ ప్ర‌భాస్. ముక్క లేనిదే ముద్దు దిగ‌దు అని ఓపెన్ గానే చెప్పారు. డార్లింగ్ ఎక్క‌డికి వెళ్లినా వెంన‌టే స‌ప‌రేట్ గా ఓ చెఫ్ ఉంటాడు. కావాల్సిన నాన్ వెజ్ వంట‌కాలు స్వ‌యంగా వ‌డ్డించుకుని తింటాడు. ఇలా చేయ‌డం కేవ‌లం ప్ర‌భాస్ కి మాత్ర‌మే సాధ్యం. ఆయ‌న ఆర‌గించ‌డ‌మే కాకుండా త‌న‌చుట్టూ ఉన్న‌వాళ్ల‌ను సైతం నాన్ వెజ్ ఐట‌మ్స్ లో ముంచేయ‌డం డార్లింగ్ ప్ర‌త్యేక‌త‌.

ఆ త‌ర్వాత అంత‌గా నాన్ వెజ్ ని ఇష్ట‌ప‌డేది యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. గ్రిల్డ్ చికెన్ గురించి ఓసారి తార‌క్ వివ‌రించిన విధానంతోనే ఎంత‌లా నోరూరించాడో నెటి జ‌నులందరికీ తెలిసిందే. అప్పుడే తార‌క్ నాన్ వెజ్ ని ఎంత‌గా ఇష్ట ప‌డ‌తాడు అన్న‌ది అంద‌రికీ తెలిసిందే. అలాగే చికెన్ బిర్యానీ ప్రియుడు కూడా. ఓ పెద్ద హండీ చికెన్ బిర్యానీ అమాంతాం లాగించేయ‌గ‌ల సామ‌ర్ధ్యం ఉన్నవారు ఒక‌ప్పుడు. ఇలా వీరిద్ద‌రి గురించి అందిరికీ తెలుసు.

మ‌రి విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కూడా నాన్ వెజ్ ప్రియుడు అంటే మీరు న‌మ్ముతారా? అంటే న‌మ్మ‌డం క‌ష్ట‌మే. 60 ఏళ్లు దాటినా చాక్లెట్ బోయ్ లా ఉంటాడు? అత‌ను నాన్ వెజ్ ప్రియుడు ఏంటి? జోక్ చేస్తున్నారా? అన‌డం స‌హ‌జం. కానీ నిజ‌మేంటి అంటే క‌మ‌ల్ హాస‌న్ కూడా విప‌రీత‌మైన నాన్ వెజ్ ప్రియుడు అట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా రివీల్ చేసారు. భోజ‌నంలో త‌ప్ప‌కుండా మాంసాహారం ఉండాల్సిందేన‌ట‌. ముఖ్యంగా మ‌ధ్నాహ్నం అయితే చేప వంట‌కాలు త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ట‌.

అందుకోసం ప్ర‌త్యేకంగా ఓ చెఫ్ ని నియ‌మించుకున్నారుట‌. క‌మ‌ల్ హాస‌న్ ఎక్క‌డ ఉంటే వెంట ఆ చెఫ్ కూడా ఉంటాడుట‌. అత‌డు అందుబాటులో ఉంటే ఫిష్ లోనే ర‌క‌ర‌కాల రుచులు ట్రై చేయిస్తారుట‌. ఒక్కో రోజు చికెన్ గ్రేవీ అందుబాటులో లేక‌పోతే కొబ్బ‌రి చెట్నీ తో దోశ తింటారుట‌. ఉద‌యం మాత్రం వ్యాయామాలు ముగించుకుని ఓట్స్ తో పాటు పండ్లు తీసుకుంటారుట‌. అదే క‌మ‌ల్ బ్రేక్ పాస్ట్. సాయంత్రం త‌క్కువ‌గా ఆహారం తీసుకుని త్వ‌ర‌గా నిద్ర‌పోవ‌డం అల‌వాటు. కొన్ని సంవ‌త్స‌రాలుగా ఇదే విధానంలో ప్ర‌యాణం సాగుతుంద‌ని తెలిపారు.