Begin typing your search above and press return to search.

'విక్రమ్‌' గట్స్ & గన్స్

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ దాదాపు దశాబ్ద కాలం తర్వాత 'విక్రమ్‌' సినిమా తో భారీ బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   7 Sep 2023 10:33 AM GMT
విక్రమ్‌ గట్స్ & గన్స్
X

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ దాదాపు దశాబ్ద కాలం తర్వాత 'విక్రమ్‌' సినిమా తో భారీ బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బిగ్గెస్ట్‌ హిట్ చిత్రాల జాబితాలో విక్రమ్‌ నిలవడంతో కమల్‌ హాసన్ మరోసారి తన సత్తా చాటాడు. ఆయన సినీ కెరీర్ ముగిసింది అనుకుంటూ ఉండగా దక్కిన విక్రమ్‌ విజయంతో తిరిగి పుంజుకుంటున్నాడు.

ఇప్పటికే ఇండియన్ 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ గా ఉన్న కమల్‌ హాసన్‌ మరో వైపు రెండు మూడు కొత్త సినిమాలకు కమిట్‌ అయ్యాడు. అందులో ఒక సినిమా కోసం గన్‌ ఫైరింగ్‌ ను ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా వీడియోను షేర్‌ చేశాడు. గట్స్ అండ్ గన్స్ అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చి తన కొత్త సినిమా ప్రకటన చేయడం జరిగింది.

హెచ్ వినోద్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్ ఈ సినిమా ను చేయబోతున్నాడు. సొంత నిర్మాణ సంస్థలో కమల్‌ హాసన్ నిర్మించబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ ఎత్తున ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతున్నట్లుగా తమిళ సినీ వర్గాలు మరియు మీడియా సర్కిల్స్ నుండి సమాచారం అందుతోంది.

కమల్‌ హాసన్‌ 233వ సినిమాగా వినోద్‌ దర్శకత్వంలో రూపొందే సినిమా రాబోతుంది. వీడియో ను షేర్ చేయడం ద్వారా యూనివర్శిల్‌ స్టార్‌ అభిమానులకు కన్నుల విందు చేయడం జరిగింది. అభిమానులతో పాటు ప్రేక్షకులు కమల్‌ హాసన్‌ ఇండియన్‌ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సమయంలో వినోద్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా పై అంచనాలు పెంచే విధంగా తాజా వీడియో ఉంది. కమల్‌ హాసన్ షేర్‌ చేసిన ఈ వీడియో ను క్షణాల్లో లక్షలాది మంది అభిమానులు చూడటంతో పాటు ఎంతో మంది షేర్‌ చేసుకుని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు.