Begin typing your search above and press return to search.

డబుల్ కాదు ట్రిపుల్‌... ఫ్యాన్స్ కి పండగ

యూనివర్శిల్‌ స్టార్ కమల్‌ హాసన్ ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో నటించిన ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు

By:  Tupaki Desk   |   18 March 2024 6:55 AM GMT
డబుల్ కాదు ట్రిపుల్‌... ఫ్యాన్స్ కి పండగ
X

యూనివర్శిల్‌ స్టార్ కమల్‌ హాసన్ ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో నటించిన ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఇండియన్ 2 కోసం ఆయన ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అంతకు మించి అన్నట్లుగా 'థగ్ లైఫ్‌' సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు.

లెజెండ్రీ డైరెక్టర్‌ మణిరత్నం దర్శకత్వంలో కమల్‌ హాసన్ హీరోగా రూపొందుతున్న థగ్ లైఫ్‌ సినిమా కోసం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయి సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గురించి ఎన్నో పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి.

కొన్ని రోజుల క్రితం థగ్‌ లైఫ్‌ లో కమల్‌ హాసన్‌ ను రెండు విభిన్నమైన పాత్రల్లో చూడబోతున్నామనే వార్తలు వచ్చాయి. తాజాగా డబుల్‌ రోల్‌ కాదు ట్రిపుల్‌ రోల్‌ అనే ప్రచారం మొదలు అయ్యింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కమల్‌ ను మూడు విభిన్నమైన పాత్రల్లో దర్శకుడు మణిరత్నం చూపించబోతున్నాడు.

కమల్‌ హాసన్‌ ను గతంలో పది పాత్రల్లో ఒకే సినిమాలో చూసిన ప్రేక్షకులు మరోసారి ఆయనకు రెండు మూడు పాత్రల్లో చూడాలని కోరుకుంటూ ఉన్నారు. ఎట్టకేలకు థగ్ లైఫ్ సినిమా తో మూడు పాత్రల్లో చూసే అవకాశం దక్కుతుంది. విక్రమ్‌ తర్వాత జోరు మీదున్న కమల్‌ హాసన్ ట్రిపుల్‌ రోల్‌ తో కుమ్మేయడం ఖాయం అనిపిస్తోంది.

పొన్నియన్ సెల్వన్‌ సినిమా తో చాలా కాలం తర్వాత తన మార్క్ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు మణిరత్నం మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో అయిదు వందల కోట్ల వసూళ్లు సాధించే సినిమాగా థగ్ లైఫ్ ను రూపొందిస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కమల్‌, మరణిరత్నం కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా సినిమా ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు.