Begin typing your search above and press return to search.

#గుస‌గుస‌.. క‌ర్కోఠ‌కుడిగా విశ్వ‌రూపం?

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన `విక్ర‌మ్` క్లీన్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. లోకేష్ క‌న‌గ‌రాజ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు

By:  Tupaki Desk   |   30 April 2024 6:09 AM GMT
#గుస‌గుస‌.. క‌ర్కోఠ‌కుడిగా విశ్వ‌రూపం?
X

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన `విక్ర‌మ్` క్లీన్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. లోకేష్ క‌న‌గ‌రాజ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. భాష‌తో సంబంధం లేకుండా ఈ సినిమా అన్ని రాష్ట్రాల్లో ఆడింది. ఇందులో క‌మ‌ల్ హాస‌న్ న‌ట‌న అద్భుతం అన్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అత‌డి పాత్రను డ్యూయ‌ల్ షేడ్ తో చాలా యూనిక్ నెస్ తో డిజైన్ చేసారు లోకేష్‌. అత‌డిని ఒక స్పై త‌ర‌హా పాత్ర‌లో చూపిస్తూనే, డ్ర‌గ్ దందా న‌డిపే విల‌న్ విజ‌య్ సేతుప‌తిని అంత‌మొందించేవాడిగా, మాన‌వాళికి మంచి చేసేవాడిగా క‌నిపించాడు. విక్ర‌మ్ పాత్ర చిత్ర‌ణ, అందులో షేడ్స్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించాయి. ప్ర‌తి షేడ్ కి త‌గ్గ‌ట్టు క‌మ‌ల్ న‌ట‌న‌, ఆహార్యం మ‌తులు చెడ‌గొట్టాయి. అందుకే ఆ సినిమా అంత‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది.

స‌రైన పాత్ర త‌న చేతికి చిక్కితే ఎలా ఉంటుందో క‌మ‌ల్ హాస‌న్ విక్ర‌మ్ సినిమాతో మ‌రోసారి నిరూపించాడు. చాలా గ్యాప్ త‌ర్వాత ఇలాంటి విల‌క్ష‌ణ‌మైన, ఎన‌ర్జిటిక్ పాత్ర‌ల్లో న‌టించ‌డంలో క‌మ‌ల్ త‌ర్వాతే అని నిరూపించారు. అయితే అలాంటి గొప్ప పాత్ర‌లో న‌టించిన క‌మ‌ల్ హాస‌న్ ని `క‌ల్కి 2898 AD` చిత్రంలో నాగ్ అశ్విన్ ఎలా చూపించ‌బోతున్నారు? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. అభిమానులు దీనిపై చాలా కాలంగా ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు. క‌మ‌ల్ హ‌స‌న్ ఈ చిత్రంలో విల‌న్ గా న‌టించ‌డం లేద‌ని, ఒక కీల‌క పాత్ర‌లో మాత్ర‌మే క‌నిపిస్తార‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి. కానీ అది నిజం కాద‌ని ఇప్పుడు తేలింది.

క‌మ‌ల్ హాస‌న్ త‌న స్థాయికి త‌గ్గ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ ప్ర‌పంచాన్ని ఏలాల‌ని, అధికారాన్ని గుప్పిట ప‌ట్టాల‌ని ప్ర‌య‌త్నించేవాడిగా, క్రూరుడిగా త‌న‌లోని విల‌క్ష‌ణ‌మైన ఆహార్యాన్ని మ‌రోసారి తెర‌పైకి తీసుకురాబోతున్నారు. ఈ పాత్రను మ‌హాభార‌తంలోని కంసుడి పాత్ర‌ను రిఫ‌రెన్స్ గా తీసుకుని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ రాసుకున్నార‌ట‌. రాజ్యాధికారం కోసం ఎంత‌టికైనా తెగించేవాడిగా, ప్రాణ‌గండం నుంచి త‌ప్పించుకునేందుకు గ‌ర్భంలో బిడ్డ‌ను సంహ‌రించాల్సందిగా శాసించేవాడిగా కంసుడు మ‌హాభార‌తంలో క‌నిపించాడు. ఇప్పుడు క‌ల్కి చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ పాత్ర కూడా అంతే క‌ర్క‌శంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ ప్ర‌పంచాన్ని ఎలాగైనా త‌న అదుపులో ఉంచుకోవాల‌ని త‌పించే భీక‌ర‌మైన విల‌న్ గా క‌నిపిస్తార‌ని స‌మాచారం. ఇక చిత్రంలో చాలా పాత్ర‌ల‌ను మ‌హాభార‌తం స‌హా పురాణేతిహాసాల స్ఫూర్తితో నాగ్ అశ్విన్ తీర్చిదిద్దార‌ని తెలుస్తోంది. ఈ వేస‌విలోనే క‌ల్కి విడుద‌ల కానుంది. దీంతో అభిమానులు స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు. ప్ర‌భాస్, క‌మ‌ల్ హాస‌న్, అమితాబ్ బ‌చ్చ‌న్ స‌హా ప‌లువురు దిగ్గ‌జ తార‌లు ఈ చిత్రంలో న‌టించారు. అమితాబ్ బ‌చ్చ‌న్ ఇందులో అశ్వ‌త్థామ అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఫ‌స్ట్ గ్లింప్స్ ఇప్ప‌టికే విడుద‌లై ఆక‌ట్టుకుంది.