Begin typing your search above and press return to search.

ఇండియన్-2 ఏమవుతుందో?

విలక్షణ నటుడు కమల్ హాసన్.. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో చేసిన విక్రమ్ మూవీతో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Jun 2024 11:30 PM GMT
ఇండియన్-2 ఏమవుతుందో?
X

విలక్షణ నటుడు కమల్ హాసన్.. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో చేసిన విక్రమ్ మూవీతో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాస్త గ్యాప్ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. ఇప్పుడు వరుస సినిమాలతో సందడి చేయనున్నారు. పాన్ ఇండియా స్టార్ కల్కి 2898 ఏడీ మూవీలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. ఆ తర్వాత భారతీయుడు 2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు కమల్ హాసన్.

దాదాపు 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ సీక్వెల్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జులై 12వ తేదీన వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన షాకింగ్ నిజాలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

వాస్తవానికి ఇండియన్-2 షూటింగ్ అప్పుడెప్పుడో స్టార్ట్ అయింది. కానీ అనేక కారణాల వల్ల నిలిచిపోయింది. మళ్లీ గత ఏడాది మొదలుపెట్టారు మేకర్స్. షూటింగ్ జరుగుతుండగా.. అనుకోని ప్రమాదం జరగ్గా కొంతమంది సిబ్బంది చనిపోయారు. వారికి మేకర్స్.. పరిహారం రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారు. అనేక నష్టాల తర్వాత షూటింగ్ ను ఎట్టకేలకు ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేశారు.

కానీ ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో ఆడియన్స్ లో బజ్ క్రియేట్ అవ్వలేదు. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ రిలీజ్ చేసిన సాంగ్స్, పోస్టర్లకు కూడా మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. చాలా ఏళ్ల తర్వాత సీక్వెల్ చేస్తుండడంతో అంత బజ్ క్రియేట్ అవ్వడం లేదని కొందరు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో కమల్.. సెకండాఫ్ లో కనిపిస్తారని టాక్ నడుస్తోంది. సిద్ధార్థ్ తో పాటు ఇతర యాక్టర్లంతా ఫస్టాఫ్ లో ఉంటారని తెలుస్తోంది.

ప్రీ క్లైమాక్స్ సమయంలో పూర్తి స్థాయిలో కమల్ ఎంట్రీ ఇస్తారని చెబుతున్నారు. దీంతో కమల్ ను ఆడియన్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ పార్ట్.. భారతీయుడు 3లో ఎక్కువగా ఉంటుందని టాక్. అయితే కమల్ లేకుండా ఫస్టాఫ్ అంతా అంటే టాక్ కాస్త తేడా కొడుతుందని అంటున్నారు. అసలకే బజ్ తక్కువగా ఉంది.. ఇప్పుడేమో షాకింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. చివరకు ఈ సినిమా రిజల్ట్ ఏమవుతుందో చూడాలి.