Begin typing your search above and press return to search.

కమల్ - రజినీ.. ఈ వయసులో కూడా బ్లాస్టింగ్ లైనప్

విక్రమ్ మూవీతో కమల్ హాసన్ తిరిగి లైన్ లోకి వచ్చారు. ఈ ఇద్దరు హీరోలు కూడా ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం విశేషం.

By:  Tupaki Desk   |   24 Jan 2024 8:30 AM GMT
కమల్ - రజినీ.. ఈ వయసులో కూడా బ్లాస్టింగ్ లైనప్
X

కోలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలుగా ఉన్నవారు కమల్ హాసన్, రజినీకాంత్. వీరికి ముందు జెనరేషన్ హీరోలు ఎవ్వరూ కూడా బ్రతికి లేరని చెప్పాలి. ఇప్పటికి హీరోలుగానే రజినీకాంత్, కమల్ హాసన్ తమ ఛరిష్మా కొనసాగిస్తున్నారు. రజినీకాంత్ వయస్సు ప్రస్తుతం 73 ఏళ్ళు అయిన కూడా గ్యాప్ లేకుండా ఏడాదికి ఒక సినిమా చొప్పున చేస్తున్నారు. ఇక కమల్ హాసన్ 69 ఏళ్ళ వయస్సులో ఉన్నారు.

విక్రమ్ మూవీతో కమల్ హాసన్ తిరిగి లైన్ లోకి వచ్చారు. ఈ ఇద్దరు హీరోలు కూడా ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం విశేషం. సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో వేటయ్య మూవీ చేస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నడుస్తోంది.

దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ కానుంది. కూతురు దర్శకత్వంలో చేసిన లాల్ సలామ్ మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. దీంతో పాటు నెల్సన్ దిలీప్ దర్శకత్వంలోనే జైలర్ 2 మూవీకి కూడా గ్రీన్ రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరికొంత మంది దర్శకులు కూడా ఆయన డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు. మరో వైపు కమల్ హాసన్ కూడా చేతిలో నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఇండియన్ 2 మూవీ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నెక్స్ట్ ఇండియన్ 3 మూవీ కూడా స్టార్ట్ కాబోతోంది. కల్కి2898 ఏడీ మూవీ షూటింగ్ కూడా ఈ ఏడాది రిలీజ్ కాబోతోంది. అన్సారివ్ దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నాడు. ఇవి కాకుండా హెచ్ వినోత్ దర్శకత్వంలో ఒక సినిమాకి ఒకే చెప్పాడు.

ఇలా ఇద్దరు స్టార్స్ కూడా ఈ వయస్సులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండటం విశేషం. వీరి సినిమాల బడ్జెట్ కూడా వందల కోట్లు దాటిపోతుంది. అయిన నిర్మాతలు వెనకడుగు వేయకుండా ఈ ఇద్దరు స్టార్స్ తో మూవీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.