అలాంటి వాళ్లు కమల్ ను చూసి నేర్చుకోవాల్సిందే!
సినిమాలను తీయడం ఒకెత్తయితే వాటిని ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లడం మరోక ఎత్తు. ప్రమోషన్స్ అనేవి ఈ రోజుల్లో సినిమా సక్సెస్ లో చాలా కీలకంగా మారాయి.
By: Tupaki Desk | 18 May 2025 4:00 AM ISTసినిమాలను తీయడం ఒకెత్తయితే వాటిని ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లడం మరోక ఎత్తు. ప్రమోషన్స్ అనేవి ఈ రోజుల్లో సినిమా సక్సెస్ లో చాలా కీలకంగా మారాయి. యావరేజ్ గా ఉన్న సినిమాను హిట్ గా, హిట్ సినిమాను బ్లాక్ బస్టర్లుగా మార్చే సత్తా ప్రమోషన్స్ కు ఉంది. అలాగని కేవలం ప్రమోషన్స్ వల్లే సినిమాలు ఆడతాయని చెప్పలేం. సినిమాలో మంచి కంటెంట్ ఉండి దాన్ని ప్రమోట్ చేస్తే అది తప్పకుండా మంచి ఫలితాన్నిస్తుంది.
అందుకే ఈ మధ్య చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరూ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటూ తమ సినిమాలను ఆడియన్స్ లోకి తీసుకెళ్తున్నారు. అయితే కొంతమంది హీరోలు ఆ ప్రమోషన్స్ కు టైమ్ కేటాయించకుండా సినిమాలో నటించినందుకు ఓ రెండు మూడు ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొని మమ అనిపిస్తూ ఉంటారు.
కానీ కమల్ హాసన్ మాత్రం ఈ వయసులో కూడా తన సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. కమల్ హాసన్ నటించిన తాజా సినిమా థగ్ లైఫ్ జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు మరో రెండు వారాలే ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. మే 17న చెన్నైలో ట్రైలర్ లాంఛ్ తో ఈ ప్రమోషన్స్ వేగాన్ని మరింత పెంచనున్నారు చిత్ర యూనిట్.
ఆ తర్వాత మే 20న ముంబైలో హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో పాటూ బాలీవుడ్ మీడియాతో స్పెషల్ ఇంటర్వ్యూలను ప్లాన్ చేశారు. మే 21న మలయాళ ట్రైలర్ లాంచ్, మే 22న తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత మే 24న చెన్నైలో ఆడియో రిలీజ్ ఈవెంట్, మే 26 నుంచి 29 వరకు ఢిల్లీ, బెంగుళూరు, త్రివేండ్రం, వైజాగ్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో స్పెషల్ ఈవెంట్స్ ను ప్లాన్ చేసింది థగ్ లైఫ్ టీమ్.
మే 31న మలేషియా వెళ్లి అక్కడో ఈవెంట్ చేసి జూన్ 1న దుబాయ్ లో ఓ మెగా ఈవెంట్ తో ప్రమోషన్స్ కు శుభం కార్డు వేయనున్నట్టు తెలుస్తోంది. పైన చెప్పిన అన్ని ఈవెంట్స్ లోనూ కమల్ హాసన్ పాల్గొనబోతున్నారు. ఈ వయసులో కూడా కమల్ సినిమాను ప్రమోట్ చేయడానికి పడుతున్న తపనను చూసి ప్రమోషన్స్ కు వంకలు చెప్పే కొంతమంది యంగ్ హీరోలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
