Begin typing your search above and press return to search.

వాళ్లు కమల్‌ని చూసి ఐనా నేర్చుకోవాలి

హిట్‌ టాక్‌ వచ్చిన సినిమాకు సరైన ప్రమోషన్స్‌ చేయక పోవడం వల్ల నష్టం జరగడం మనం చూస్తూ ఉంటాం. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు హీరోలు ప్రమోషన్‌ అంటే మొహం చాటేస్తారు.

By:  Tupaki Desk   |   27 May 2025 3:00 PM IST
Kamal Haasan Goes All Out in Promotions for Thug Life
X

సినిమా మేకింగ్‌ ఒక ఎత్తు అయితే, ఆ సినిమాను ప్రమోట్‌ చేయడం పెద్ద టాస్క్‌గా మారింది. ఒకప్పుడు హీరోలు సినిమా షూటింగ్‌ పూర్తి చేసి, మరో సినిమా షూటింగ్‌తో బిజీ అయ్యే వారు. కానీ ఇప్పుడు అలా చేసే పరిస్థితి లేదు. సినిమాను హీరో, హీరోయిన్‌, దర్శక నిర్మాతలు అందరూ కనీసం నెల రోజుల పాటు యాక్టివ్‌గా ప్రమోట్‌ చేయాల్సిందే. అలా చేస్తేనే సినిమా జనాల్లోకి వెళ్తుంది, థియేటర్‌ రిలీజ్‌ సమయంలో మినిమం ఓపెనింగ్స్ నమోదు అవుతాయి. సినిమా ఫలితం తో సంబంధం లేకుండా సినిమాకు మినిమం వసూళ్లు రావాలి అంటే కచ్చితంగా బజ్‌ క్రియేట్‌ అయ్యే విధంగా సినిమాను ప్రమోట్‌ చేయాల్సిందే. అలా చేస్తేనే సినిమాకు మంచి ఫలితం దక్కుతుంది.

హిట్‌ టాక్‌ వచ్చిన సినిమాకు సరైన ప్రమోషన్స్‌ చేయక పోవడం వల్ల నష్టం జరగడం మనం చూస్తూ ఉంటాం. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు హీరోలు ప్రమోషన్‌ అంటే మొహం చాటేస్తారు. హీరోయిన్స్‌ లో నయనతార ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటుంది. హీరోలు, హీరోయిన్స్‌ ప్రమోషన్‌ చేయని సినిమాలు హిట్‌ టాక్‌ వచ్చినా ఆడిన దాఖలాలు లేవు. అందుకే కమల్‌ వంటి సీనియర్‌ స్టార్‌ హీరో సైతం సినిమాల ప్రమోషన్‌ విషయంలో చాలా అగ్రెసివ్‌గా ఉంటారు. ఈ సినిమా.. ఆ సినిమా అనే తేడా లేకుండా తన అన్ని సినిమాలకు చాలా యాక్టివ్‌గా ప్రమోట్‌ చేస్తారు. ప్రస్తుతం కమల్‌ హాసన్ థగ్‌ లైఫ్ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు.

తమిళ్‌ మూవీ అయిన థగ్‌ లైఫ్ సినిమా ప్రమోషన్‌ను దేశ వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. కమల్‌ హాసన్‌, మణిరత్నం కాంబోలో సుదీర్ఘ కాలం తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను చేశాం అంటున్నారు. గతంలో మా కాంబోలో వచ్చిన నాయకుడు సినిమాను బీట్‌ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చేసిన వ్యాక్యలు, సినిమాకి విపరీతమైన హైప్‌ను క్రియేట్‌ చేశాయి. జూన్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న థగ్‌ లైఫ్ ప్రమోషన్‌లో కమల్‌ పాల్గొంటున్న తీరు చాలా మందికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. మొన్నటికి మొన్న హైదరాబాద్‌ వచ్చిన కమల్‌ హాసన్‌, ఆ తర్వాత నార్త్‌ ఇండియాలోనూ సందడి చేశారు.

తమిళనాట సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఎన్నో కార్యక్రమాలకు కమల్‌ హాసన్ హాజరు అవుతున్నాడు. తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాంతాల్లో తిరుగుతూ కమల్‌ హాసన్ ప్రచారం చేయడం చూసి ఇండస్ట్రీ వర్గాల వారు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏడు పదుల వయసులో కమల్‌ హాసన్ చాలా యాక్టివ్‌గా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కావడంను చూసి యంగ్‌ హీరోలు చాలా నేర్చుకోవాలని, సినిమా ప్రమోషన్‌కి మొహం చాటేసే హీరోలు కమల్‌ హాసన్‌ను చూసి ఐనా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కేవలం తమిళనాడులో మాత్రమే కాకుండా పాన్‌ ఇండియా రేంజ్‌లో సినిమాను ప్రమోట్‌ చేస్తున్నారు. థగ్‌ లైఫ్‌ కమల్‌ కెరీర్‌లో మరో నిలిచి పోయే సినిమా అవుతుందా అనేది తెలియాలంటే జూన్‌ 5 వరకు వెయిట్‌ చేయాల్సిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించగా తమిళ యంగ్‌ హీరో శింబు కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. థగ్‌ లైఫ్ సినిమా ప్రకటించినప్పటి నుంచి అంచనాలు పెరుగుతూ వచ్చాయి. సినిమా అంచనాలకు తగ్గట్లుగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి.