సోషల్ మీడియాకు స్పెషల్ థ్యాంక్స్
ఉలగనాయగన్ కమల్‌హాసన్ హీరోగా విజనరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా థగ్ లైఫ్.
By: Tupaki Desk | 6 May 2025 9:28 AM ISTఉలగనాయగన్ కమల్‌హాసన్ హీరోగా విజనరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా థగ్ లైఫ్. కమల్- మణిరత్నం కాంబినేషన్ లో 35 ఏళ్ల తర్వాత సినిమా రానుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ నటిస్తుండగా, శింబు థగ్ లైఫ్ లో కీలక పాత్ర చేస్తున్నాడు.
భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుండగా, రీసెంట్ గా ఆ సినిమా నుంచి జింగుచా అనే వెడ్డింగ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. రెహమాన్ సంగీతం అందించిన ఈ సాంగ్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సాంగ్ విజువల్ గా కూడా ఐఫీస్ట్ లా ఉంది. కమల్ ఈ సాంగ్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్ తో కట్టిపడేశాడు.
అయితే రీసెంట్ గా కమల్ తన థగ్ లైఫ్ టీమ్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ప్రతీ సినిమాకీ ఒక్కో వేరియేషన్, కొత్తదనం, డిఫరెంట్ షేడ్స్ ను మీరెలా చూపిస్తారు? అదెలా సాధ్యం అని అడగ్గా దానికి కమల్ సమాధానమిచ్చాడు. రియల్ లైఫ్ లో ఎన్నో పాత్రలు పోషిస్తామని, మనం చేసే ప్రతీదీ యాక్టింగేనని, అది కూడా సినిమానేనని, సోషల్ మీడియా వచ్చాక ఎంతోమందిని చూస్తున్నామని, సోషల్ మీడియా పెరిగాక ప్రతీదీ చాలా ఈజీ అయిపోయిందని, ఈ సందర్భంగా తాను సోషల్ మీడియాకు స్పెషల్ థాంక్స్ చెప్తున్నట్టు కమల్ తెలిపాడు.
