ఆ స్టార్ హీరోకి అందాల త్రిష జోడీ కాదా?
ఇందులో హీరోయిన్లగా త్రిష, అభిరామి నటిస్తున్నారు. మరి ఇందులో కమల్ కి జోడీగా నటించేది ఎవరు? అంటే ఎలాంటి సందేహం లేకుండా ఇంకెవరు? త్రిష అనుకుంటారంతా.
By: Tupaki Desk | 20 April 2025 8:15 AM ISTవిశ్వ నటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో `థగ్ లైఫ్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. `నాయకుడు` తర్వాత ఇద్దరు కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రమిది. ఇంతవరకూ రాజ్ కమల్ ఫిల్మ్స్ లో మణిరత్నం కూడా సినిమా చేయలేదు. దీంతో కమల్ హాసన్ ని హీరోగానే కాక నిర్మాతగాను మణి చూడాల్సిన సన్నివేశం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
ఇందులో హీరోయిన్లగా త్రిష, అభిరామి నటిస్తున్నారు. మరి ఇందులో కమల్ కి జోడీగా నటించేది ఎవరు? అంటే ఎలాంటి సందేహం లేకుండా ఇంకెవరు? త్రిష అనుకుంటారంతా. కానీ కమల్ కి జోడీగా నటించింది త్రిష కాదు సీనియర్ నటి అభిరామి. శింభు కు జోడీగా త్రిష నటిస్తుంది. సినిమాలో ఈ రెండు పాత్రలు ఎంతో కీలకమైనవి. హీరోల పాత్రలకు ధీటుగా ఉంటాయని తెలుస్తోంది. మణిరత్నం ఎలాంటి సినిమా తీసినా? అందులో రొమాన్స్ కి ప్రాధాన్యత ఇస్తారు.
`థగ్ లైఫ్` లోనూ తనదైన మార్క్ రొమాన్స్ ఉంటుందని చెబుతున్నారు. జూన్ లో చిత్రాన్నిరిలీజ్ చేయాల ని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇంతవరకూ సరైన ప్రచారం చేయలేదు. `థగ్ లైఫ్` ప్రకటన తర్వాత సినిమా గురించి ఏ విషయాలు వెల్లడించలేదు. ఆన్ సెట్స్ లో ఉన్నా పెద్దగా లీకులు రాలేదు. దీంతో యూనిట్ ప్రచారం పనులు మొదలు పెట్టింది. తొలి సింగిల్ తో ప్రచారం మొదలు పెట్టారు.
ఇకపై సినిమాలో పాటలన్నీ ఒక్కొక్కటిగా రిలీజ్ కానున్నాయి. ఈసినిమాకు రెహమాన్ సంగీతం అంది స్తున్నారు. ముగ్గురు కాంబినేషన్ లో చాలా కాలం తర్వాత పడిన చిత్రమిది. దీంతో సినిమా రిలీజ్ కి ముందే మ్యూజికల్ గా సంచలనమవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
