క్షమాపణ చెప్పకపోవడం ఖరీదు 30 కోట్ల నష్టం!
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన 'థగ్ లైఫ్' జూన్ 5న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కానీ తొలి షోతోనే థగ్ లైఫ్ తేలిపోయింది.
By: Tupaki Desk | 10 Jun 2025 11:51 AM ISTవిశ్వనటుడు కమల్ హాసన్ నటించిన 'థగ్ లైఫ్' జూన్ 5న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కానీ తొలి షోతోనే థగ్ లైఫ్ తేలిపోయింది. మణిరత్నం మరోసారి రోటీన్ చిత్రంతో ప్రేక్షకులకు విసుగు పుట్టించారు. 'నాయకుడు' తర్వాత మరో నాయకుడు లాంటి గొప్ప చిత్రం వస్తుందనుకుంటే? తెరపై రొటీన్ గ్యాంగ్ స్టర్ డ్రామాను చూపించి సహనం పరీక్షించారు. ఆ సంగతి పక్కనబెడితే ఈ సినిమా మూడు రోజుల్లో 30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.
చివరి రోజు ఆదివారం వసూళ్లతో కలిపి నాలుగు రోజుల్లో దేశ వ్యాప్తంగా 40 కోట్ల నికర వసూళ్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తేనాలుగు రోజుల్లో 73 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే సాధించింది. కనీసం కమల్ గత చిత్రం ఇండియన్ 2 వసూళ్లకు దరిదాపుల్లో కూడా లేదు. ఇండియన్ 2 బాక్సాఫీస్ వద్ద ఫెయిలైనా నాలుగు రోజుల్లో 110 కోట్ల వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమా కర్ణాటకలో రిలీజ్ కాకపోవడంతో దురదృష్టకరం.
కమల్ హాసన్ ఆ రాష్ట్ర భాషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కర్నాటకలో పెద్ద దుమారం లేచిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రభుత్వం సినిమాను విడుదల కాకుండా బ్యాన్ చేసింది. దీంతో రాష్ట్రంలో ఎక్కడా థగ్ లైఫ్ రిలీజ్ అవ్వలేదు. ఒకవేళ అక్కడ రిలీజ్ అయితే ఇండియన్ 2వ వసూళ్ల దగరకైనా థగ్ లైప్ చేరేది. కారణం ఏదైనా కమల్ క్షమాపణ చెప్పకపోవడం అన్నది 30 కోట్ల మేర నష్టం అంచనా తె రపైకి వస్తుంది.
కమల్ సినిమాలకు ఆ రాష్ట్రంలోనూ మంచి డిమాండ్ ఉంటుంది. అక్కడా పెద్ద ఎత్తున ఓపెనింగ్స్ దక్కు తాయి. ఈ వివాదం అంతా దేనికి క్షమాపణలు చెబితే అంతా సర్దుకుంటుందని కోరినా? కమల్ వెనక్కి తగ్గలేదు. తన మాటకే కట్టుబడి ఉన్నారు. ఈచిత్రాన్ని కమల్ హాసన్ -మణిరత్నం కలిసి నిర్మించిన సంగతి తెలిసిందే.
