Begin typing your search above and press return to search.

ఒక్క లిప్‌లాక్‌తో హీట్ పుట్టించిన క‌మ‌ల్

సీరియ‌ల్ కిస్స‌ర్ గా ఇమ్రాన్ హ‌ష్మి ఒక బ్రాండ్ వేస్తే, అంత‌కుముందే క‌మ‌ల్ హాస‌న్, అమీర్ ఖాన్ లాంటి సీనియ‌ర్లు ఇలాంటి విద్య‌ల్లో ఆరితేరి ఉన్నారు

By:  Tupaki Desk   |   18 May 2025 10:58 AM IST
ఒక్క లిప్‌లాక్‌తో హీట్ పుట్టించిన క‌మ‌ల్
X

సీరియ‌ల్ కిస్స‌ర్ గా ఇమ్రాన్ హ‌ష్మి ఒక బ్రాండ్ వేస్తే, అంత‌కుముందే క‌మ‌ల్ హాస‌న్, అమీర్ ఖాన్ లాంటి సీనియ‌ర్లు ఇలాంటి విద్య‌ల్లో ఆరితేరి ఉన్నారు. ముఖ్యంగా సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్ కూడా లిప్ లాక్ వేయడం ఎలానో నేర్పిన ఘ‌నుడు క‌మ‌ల్ హాస‌న్. నిజానికి నేటి బాలీవుడ్ సూప‌ర్ స్టార్లు అంద‌రూ క‌మ‌ల్ హాస‌న్ ముందు ఒక‌ప్పుడు అర‌దండం వేసిన వాళ్లే. ఒక సౌత్ స్టార్ నార్త్ లో ఎద‌గ‌డం ఇష్టం లేని కొంద‌రు చేసిన కుట్ర‌ల కార‌ణంగా క‌మ‌ల్ హాస‌న్ చివ‌రికి సౌత్ కి వచ్చేయాల్సి వ‌చ్చింది కానీ.... అస‌లు సిస‌లు కిస్సుల కిక్కు ఎలా ఉంటుందో హిందీ చిత్ర‌సీమ‌కు బాగా నేర్పించ‌గ‌లిగే ఘ‌నుడిగా క‌మల్ పేరు చిర‌స్థాయిగా నిలిచేది.

ఇప్పుడు మ‌రోసారి లిప్ కిస్ కార‌ణంగా క‌మ‌ల్ హాస‌న్ పేరు మార్మోగుతోంది. 60 ప్ల‌స్ ఏజ్ లోను క‌మ‌ల్ ఘాటైన అద‌ర‌చుంబ‌నంతో అద‌ర‌గొట్టేసాడు. మ‌ణిర‌త్నం `థ‌గ్ లైఫ్`లో చాలా అంశాలు చ‌ర్చ‌గా మారగా, ఇందులో ప్ర‌ధానంగా క‌మ‌ల్ హాస‌న్ లిప్ లాక్ కూడా హైలైట్ అయింది. అస‌లు క‌మ‌ల్ లిప్ లాక్ వేసింది ఎవ‌రితో? అంటూ ఆరాలు తీసారు. త్రిష లాంటి క్యూట్ గాళ్ తో అదిరిపోయే రొమాన్స్ చేస్తున్న క‌మ‌ల్, సీనియ‌ర్ న‌టి అభిరామితో ఘాటైన అద‌ర‌చుంబ‌నం లాగించేయ‌డం ట్రైల‌ర్ లో సెక‌ను పాటు మెరిసే గ్లింప్స్ లా క‌నిపిస్తుంది. అయినా చాలా మంది దీనిని జూమ్ చేసి చూడ‌టానికి కార‌ణం క‌మ‌ల్ లిప్ లాక్ వేసింది త్రిష‌తో కాదు క‌దా! అని సందేహించ‌డ‌మే. త్రిష‌తో క‌మ‌ల్ స‌ర్ ఘాటైన స‌న్నివేశాల‌కు కొద‌వేమీ లేదు. కానీ, దానిని కూడా కేవ‌లం అర‌సెక‌ను గ్లింప్స్ లా ట్రైల‌ర్ లో ప‌రిచ‌యం చేసి వ‌దిలేసారు మ‌ణి స‌ర్.

థగ్ లైఫ్ తో మ‌రోసారి పాత ఫ‌ర్ములానే తిరిగి వాడేస్తున్న మ‌ణిర‌త్నం తండ్రి కొడుకుల వైరం నేప‌థ్యంలో ర‌క్తి క‌ట్టించే క‌థ‌నే అల్లారు. థ‌గ్స్ సామ్రాజ్యంలో ఆస్తులు, అంత‌స్తులు, అధికారానికి సంబంధించిన గొడ‌వ‌ల‌ను తెర‌పై ర‌క్తి క‌ట్టించేలా తెర‌కెక్కించార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇంత‌కుముందు `న‌వాబ్` చిత్రంలో ఆస్తులు, అంత‌స్తుల కోసం అన్న‌ద‌మ్ములు కొట్టుకుని చ‌స్తారు. ఇప్పుడు ఏకంగా తండ్రి కొడుకులే త‌న్నుకు చ‌స్తారు. మొత్తానికి ర‌క్తి క‌ట్టించే థ‌గ్స్ క‌థ‌లో కూడా తండ్రి కొడుకు సెంటిమెంటును జోడించి మ‌ణిర‌త్నం థియేట‌ర్ల‌లో హీట్ పుట్టించ‌బోతున్నారు. ఈ చిత్రంలో మ‌రోసారి క‌మ‌ల్ హాస‌న్, శింబు లాంటి స్టార్ల నుంచి అవార్డ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ చూడ‌టం ఖాయ‌మ‌ని ట్రైల‌ర్ చెబుతోంది. మోస్ట్ అవైటెడ్ థగ్ లైఫ్ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ సినిమాకి మంచి హైప్‌ను సృష్టించింది. ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి శ్రేష్ట్ మూవీస్ ద్వారా తెలుగులో విడుదల చేస్తున్నారు. విక్ర‌మ్ లాంటి హై ఇంటెన్స్ మూవీ త‌ర్వాత క‌మ‌ల్ దానిని మ‌రో స్థాయికి తీసుకెళ‌తారా లేదా? అన్న‌ది వేచి చూడాలి.