కమల్.. అలా అనడమెందుకు? డిలీట్ చేయడమెందుకు?
రీసెంట్ గా ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో కన్నడ మూలం గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. తమిళం నుంచి కన్నడ పుట్టిందని వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 1 Jun 2025 6:16 PM ISTప్రముఖ నటుడు కమల్ హాసన్.. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో థగ్ లైఫ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మణిరత్నం దర్శకత్వం వహించిన ఆ సినిమా.. జూన్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. దీంతో ఆయన ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అదే సమయంలో వార్తల్లో నిలుస్తున్నారు.
రీసెంట్ గా ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో కన్నడ మూలం గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. తమిళం నుంచి కన్నడ పుట్టిందని వ్యాఖ్యానించారు. దీంతో కన్నడ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కానీ అందుకు కమల్ ఒప్పుకోవడం లేదు. తప్పు చేయకుంటే చెప్పనుంటున్నారు.
అదే సమయంలో ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ సమయంలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సినిమాతో పాటు మిగతా విషయాలపై కూడా మాట్లాడారు. కానీ ఇప్పుడు థగ్ లైఫ్ మేకర్స్ చేసిన పని వైరల్ గా మారింది. సినిమాకు సంబంధించని ప్రశ్నలను సెన్సార్ చేశారు.
అయితే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మొత్తం థగ్ లైఫ్ కోసమే మాట్లాడారు. కానీ సనాతన ధర్మం గురించి రెండు క్వశ్చన్స్ అడగ్గా, ఆన్సర్ ఇచ్చారు. అవి కూడా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సనాతన ధర్మం అంశం కొద్ది రోజుల క్రితం హాట్ టాపిక్ గా మారింది. ఆయన పొలిటికల్ లీడర్ కాబట్టి సదరు మీడియా అడిగినట్టు ఉంది.
సనాతన ధర్మంపై మీ అభిప్రాయం ఏంటని అడిగిన వెంటనే కమల్ రెస్పాండ్ అయ్యారు. తనకు ఎలాంటి అభిప్రాయం లేదని, నా ధర్మం వేరని తెలిపారు. కానీ తన ధర్మం పాటించే వారే ఎక్కువ ఉన్నారని చెప్పుకొచ్చారు. అందువల్ల తానేం పట్టించుకోనని చెప్పారు. కానీ ఆయనది సనాతన ధర్మం పాటించే వంశమేనన్న విషయం తెలిసిందే.
దీంతో అది అడగ్గా.. తనను తన నాన్న అలా పెంచలేదని చెప్పారు. ఇలాగే ఉండు అని చెప్పి ఉంటే అప్పుడు ఆలోచించే వాడినని అన్నారు. కానీ తాను స్పేచ్ఛగా పెరిగానని, అందుకే తన ధర్మం వేరని చెప్పారు. తనకు మిగతావన్నీ అనవసరమని చెప్పారు. ఇప్పుడు ఆ కామెంట్స్ ను మేకర్స్ తీసేశారు. దీంతో స్పందించడమెందుకు, అలా అనడమెందుకు.. ఇప్పుడు డిలీట్ చేయడమెందుకు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
