Begin typing your search above and press return to search.

CM అవ్వాల‌ని క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారా?

తాజాగా చెన్నైలోని ఆడియో ఈవెంట్లో అత‌డు త‌న రాజ‌కీయ ఆరంగేట్రం గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. ''నేను ముఖ్యమంత్రిని కావడానికి రాజకీయాల్లోకి రాలేదు.

By:  Tupaki Desk   |   25 May 2025 11:48 AM IST
CM అవ్వాల‌ని క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారా?
X

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ సొంత రాజ‌కీయ పార్టీని స్థాపించి త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ప్ర‌వేశించిన సంగ‌తి తెలిసిందే. కానీ అత‌డు రాజ‌కీయాల్లో ఆశించినంత‌గా రాణించ‌లేక‌పోయాడు. మక్కల్ నీది మయ్యం పార్టీ ఇప్పుడు స్త‌బ్ధుగా ఉంది. ప్ర‌స్తుతం అత‌డు పూర్తిగా త‌న జీవితాన్ని న‌ట‌న‌కే అంకిత‌మిచ్చాడు. అతడు న‌టించిన తాజా చిత్రం థ‌గ్ లైఫ్ జూన్ 5న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌ణిరత్నం ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. థ‌గ్ లైఫ్ అన్ని ద‌క్షిణాది బాష‌లు స‌హా హిందీలోను భారీగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఈ సంద‌ర్భంగా, ఇటీవ‌ల క‌మ‌ల్ దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల‌కు ప‌ర్య‌టించి అక్క‌డ త‌న సినిమాని ప్ర‌మోట్ చేస్తున్నారు. తాజాగా చెన్నైలోని ఆడియో ఈవెంట్లో అత‌డు త‌న రాజ‌కీయ ఆరంగేట్రం గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. ''నేను ముఖ్యమంత్రిని కావడానికి రాజకీయాల్లోకి రాలేదు. నా అభిమానులకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియక రాజకీయాల్లోకి వచ్చాన''ని క‌మ‌ల్ హాస‌న్ అన్నాడు.

ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ, ''నేను ఎల్ధామ్ రోడ్డులో నడుస్తున్న బాలుడిని. బాలచందర్ అకస్మాత్తుగా నాకు ఫోన్ చేసి నటుడవ్వ‌మ‌ని అన్నారు. న‌టుడ‌వ్వ‌డానికి నాకు వేదికను ఏర్పాటు చేయడానికి నాకు బలాన్ని ఇచ్చిన వ్యక్తి బాలచందర్. ఈ ప్రదేశంలో, నా మార్గంలో నా సూత్రాలపై నడవడానికి నాకు సహాయం చేసిన నా కుటుంబాన్ని నేను గుర్తుంచుకుంటాను. నేను ఇప్పటివరకు 233 చిత్రాలలో నటించాను. సినిమాలు చేస్తున్నప్పుడు నేను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను. వాటిలో చాలా మర్చిపోయాను. కారణం ఈ క్రూరత్వమంతా నన్ను అడగకుండానే, మీ మద్దతు, ఉత్సాహం నన్ను పైకి లేపి నా కన్నీళ్లను తుడిచింది.

అలాంటి అభిమానులకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియక నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను ముఖ్యమంత్రిని కావడానికి రాజకీయాల్లోకి రాలేదు. నాకు ఎమ్మెల్యే, ఎంపీ అంటే అర్థం కాలేదు. కానీ 40 సంవత్సరాలుగా, ఒక నియోజకవర్గం కోసం ఒక ఎమ్మెల్యే ఏమి చేయాలో మేము ఓపికగా చేస్తున్నాము. ఎందుకంటే మేము వ్యక్తిగతంగా కేవ‌లం మ‌నుషులం. రాజ‌కీయాల్లో అప్పటి నుండి నాతో పనిచేసిన సోదరులందరూ నేడు సమాజంలో గొప్ప వ్యక్తులుగా మారారు'' అని స్పీచ్‌ని ఉద్విగ్నంగా కొన‌సాగించారు. క‌మ‌ల్ హాస‌న్ అద్భుత‌ స్పీచ్ అభిమానుల‌తో పాటు సాధార‌ణ ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకుంది.