పొంగిపోతున్న పీకే ఫ్యాన్స్..ఎందుకో తెలుసా?
దాదాపు స్టార్ హీరోలంతా విషెస్ తెలియజేసారు. ఈ క్రమంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.
By: Tupaki Desk | 30 Jun 2025 11:07 AM ISTవిశ్వనటుడు కమల్ హాసన్ ఇటీవలే ఆస్కార్ అకాడమీ మెంబర్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. భారతీయ చిత్ర పరిశ్రమ తరుపున కమల్ తో పాటు మరికొంత మంది సినీ రంగానికి చెందిన వారు ఎంపిక కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా కమల్ ఎంపికపై అన్ని చిత్ర పరిశ్రమలు స్పందించాయి. దాదాపు స్టార్ హీరోలంతా విషెస్ తెలియజేసారు. ఈ క్రమంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.
కమల్ పనితనాన్ని ప్రశంసిస్తు ఓ లేఖ విడుదల చేసారు పవన్. తాజాగా పీకే లేఖపై కమల్ కూడా సంతోషం వ్యక్తం చేసారు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ను కమల్ బ్రదర్ అంటూ సంబోధించారు. మీ అభినందనలు ఎంతో విలువైనవి. గ్లోబల్ స్టేజ్ పై ఇండియన్ సినిమా తరపున రిప్రెజెంటర్ గా చేయడం గర్వ కారణంగా భావిస్తున్నా' అని కమల్ మరోసారి స్పందించారు.
ఇలా పవన్-కమల్ పోస్టుల నేపథ్యంలో పవన్ అభిమానులు సంతోషపడుతున్నారు. ఇలాంటి సెలబ్రేషన్లు పవన్ అభిమానులకు కొత్తేం కాదు. పవన్ నామస్మరణ ఎవరూ చేసినా ఇదే విధంగా స్పందిస్తుంటారు. పవర్ స్టార్ పై ఉన్న అభిమానం అలాంటిది. సాక్షత్తు విశ్వనటుడే పవన్ ను బ్రదర్ అని సంబోధించడంతో వాళ్ల ఆనందానికి అవధుల్లేవ్.
దేశం గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్. భారతీయ తెరపై ఆయన పోషించని పాత్ర అంటూ లేదు. ప్రయోగాలకు పెట్టింది పేరు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలు రాసిపెట్టారు. అలాంటి లెజెండరీ నటుడికి ఆస్కార్ మెంబర్ అనే గౌరవం ఇప్పటికే ఆలస్యమైంది. అయినా అకాడమీ ఇప్పటికైనా గుర్తించి ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.
