Begin typing your search above and press return to search.

మాఫియా బెదిరింపుల‌పై ఓపెనైన‌ క‌మ‌ల్ హాసన్

క‌మల్ హాసన్ ఇండియ‌న్ సినిమా ఐక‌న్‌గా సుప్ర‌సిద్ధులు. విశ్వ‌న‌టుడుగా అజేయుడిగా క‌ళ‌ను మరో స్థాయికి చేర్చిన లెజెండ‌రీ న‌టుడు ఆయ‌న‌.

By:  Tupaki Desk   |   5 Jun 2025 10:10 AM IST
మాఫియా బెదిరింపుల‌పై ఓపెనైన‌ క‌మ‌ల్ హాసన్
X

క‌మల్ హాసన్ ఇండియ‌న్ సినిమా ఐక‌న్‌గా సుప్ర‌సిద్ధులు. విశ్వ‌న‌టుడుగా అజేయుడిగా క‌ళ‌ను మరో స్థాయికి చేర్చిన లెజెండ‌రీ న‌టుడు ఆయ‌న‌. కెరీర్ లో అత‌డు చేయ‌ని ప్ర‌యోగాలు లేవు. ముఖ్యంగా తమిళం-తెలుగులో అగ్ర‌హీరోగా కొన‌సాగిన క‌మ‌ల్ హాస‌న్ 1981లో `ఏక్ దుజే కేలియే`తో హిందీ సినీ రంగంలోకి ప్రవేశించాడు. అయితే బాలీవుడ్‌లో కొద్దికాలం పనిచేసిన తర్వాత కమల్ హాసన్ 'బాంబే డ్రీమ్‌' ని కొనసాగించకూడదని ఆ ప‌రిశ్ర‌మ నుంచి వైదొల‌గాల‌ని నిర్ణయించుకున్నాడు. దీనికి కార‌ణ‌మేమిటో థ‌గ్ లైఫ్ ప్ర‌చార‌ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసారు.

క‌మ‌ల్ హాస‌న్ ప్రారంభం ఇత‌రుల్లానే ఆర్థిక క‌ష్టాల‌ను ఎదుర్కొన్నారు. కానీ అదృష్టం క‌లిసొచ్చి 6 సినిమాలు చేయగలిగారు. కానీ తాను బాలీవుడ్ వ‌దిలేయ‌డానికి అవ‌కాశాలు లేక‌పోవ‌డం, ఇచ్చేవాళ్లు లేక‌పోవ‌డం కార‌ణం కాదని అన్నారు. మరో ముఖ్య‌ కారణం ఉంది. అక్క‌డి వారికి చాలా అండర్ వరల్డ్ కనెక్షన్లు ఉన్నాయి. మాఫియా ఒత్తిడులే దానికి కార‌ణం. నేను ఇలాంటివి వ్యతిరేకించడానికి లేదా బెదిరింపులకు లొంగిపోవడానికి అక్కడ ఉండదలచుకోలేదని క‌మ‌ల్ అన్నారు.

అయితే క‌మ‌ల్ హాస‌న్ చాలా కాలం క్రితం జ‌రిగిన ఓ ఇంట‌ర్వ్యూలో దీనిని మ‌రింత విశ్లేష‌ణాత్మ‌కంగా వివ‌రించారు. ఆ వివ‌రాల్లోకి వెళితే... మాఫియా సంబంధాలు, నల్లధనంతో నాకు ఎలాంటి సంబంధం లేదని నిర్ణయించుకున్న నటుల్లో నేనూ ఒకడిని.. అవినీతి లేకుండా ఒక నటుడిని పెద్ద స్టార్ గా చేయడం సాధ్యమేనా? అని ప్ర‌శ్నిస్తే.. అది సాధ్య‌మేన‌ని, తాను దానికి ప్రత్యక్ష నిదర్శనమ‌ని క‌మ‌ల్ హాస‌న్ చెప్పారు.

నేను చాలా కాలం వేచి చూసాను. కానీ నెమ్మ‌దిగా కారులో వెళ్లాను. ఆ స్థాయికి ఎదిగాను. ఇది సాధ్యమే. ఇంతకు ముందు ఎవరో అలా చేశారు. కెమెరామెన్ విన్సెంట్ అలా చేసారు. నల్లధనాన్ని తానెప్పుడూ ముట్టుకోలేదు. నల్లధనాన్ని మీ వద్ద ఉంచుకోవద్దని ప్రభుత్వాలు బెదిరించడానికి ముందు ఇది చాలా కాలం కొన‌సాగింది. నేను - నా సోదరుడు అలాంటి బెదిరింపుల‌ను రిసీవ్ చేసుకున్నాము.. అని క‌మ‌ల్ తెలిపారు. కమల్ హాసన్ న‌టించిన థ‌గ్ లైఫ్ ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.