Begin typing your search above and press return to search.

చిన్నాని రంగంలోకి దించుతోన్న న‌యా స్టార్!

విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాసన్ ఇటీవ‌లే `థ‌గ్ లైఫ్` తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చి భంగ‌ప‌డ్డారు. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా తీవ్ర విమ‌ర్శ పాలైంది.

By:  Tupaki Desk   |   25 Jun 2025 4:15 PM IST
చిన్నాని రంగంలోకి దించుతోన్న న‌యా స్టార్!
X

విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాసన్ ఇటీవ‌లే `థ‌గ్ లైఫ్` తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చి భంగ‌ప‌డ్డారు. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా తీవ్ర విమ‌ర్శ పాలైంది. చివ‌ర‌కు ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం దిగొచ్చి క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పాల్సి వ‌చ్చింది. ఇదంతా గ‌తం. మ‌రి ఇప్పుడు క‌మ‌ల్ ఏం చేస్తున్న‌ట్లు? అంటే స్టంట్ మాస్ట‌ర్ అన్బు- అరీవు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు రెడీ అవుతున్నారు. ఈ యాక్ష‌న్ చిత్రం త్వ‌ర‌లోనే ప‌ట్టా లెక్కనుంది.

ఈ లోగా క‌మ‌ల్ మ‌రో డైరెక్ట‌ర్ని కూడా లైన్ లో పెడుతున్నారు. అరుణ్ కుమార్ అనే డైరెక్ట‌ర్ ని తెర‌పైకి తెస్తున్నారు. ఇటీవ‌లే ఇద్ద‌రి మ‌ధ్య స్టోరీ డిస్క‌ష‌న్ జ‌ర‌గ‌గా న‌చ్చ‌డంతో క‌మ‌ల్ ఒకే చేసారట‌. దీంతో ఈ చిత్రాన్ని కూడా క‌మ‌ల్ త‌న సొంత నిర్మాణ సంస్థ రాజ్ క‌మ‌ల్ ఫిల్మ్స్ పైనే నిర్మించాల‌నుకుంటున్నారట‌. ఇది భారీ స్పాన్ ఉన్న చిత్ర‌మని క‌మ‌ల్ భావిస్తున్నారట‌. ఇత‌ర భాషల నుంచి కూడా న‌టీన‌టుల్ని తీసుకోవాల‌నుకుంటున్నారట‌. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

అరుణ్ కుమార్ విష‌యానికి వ‌స్తే? 'ప‌న్నియార‌మ్ ప‌న్నియ‌మ్' చిత్రంతో దర్శుకుడిగా ప‌రిచ‌య్యాడు. ఇందొక ఫ్యామిలీ కామెడీ డ్రామా. ఇందులో విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టించాడు. అటుపై విజ‌య్ సేతుప‌తితోనే 'సేతుప‌తి' టైటిల్ తో ఓ పోలీస్ స్టోరీ తెర‌కెక్కించాడు. ఇది మంచి విజ‌యం సాధించింది. త‌న మూడ‌వ చిత్రాన్ని కూడా విజ‌య్ తోనే చేసాడు. ఆ తర్వాత సిద్దార్ద్ తో 'చిన్నా' తెర‌కెక్కించాడు.

ఈ సినిమాతో అత‌డికి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది. త‌మిళ్‌, తెలుగులో ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. అలాగే చియాన్ విక్ర‌మ్ తో 'వీర ధీర శూర‌న్ 2' తెర‌కెక్కించాడు. ఈసినిమా కూడా బాగానే ఆడింది. ఈ నేప‌థ్యంలో క‌మ‌ల్ హాస‌న్ కూడా విక్ర‌మ్ తో ప‌నిచేయ‌డానికి ముందుకొస్తున్న‌ట్లు తెలుస్తోంది.