ఆస్టార్ హీరోని ఇకపై అలా పిలవకూడదు!
కమల్ హాసన్ పేరుకు ముందు `ఉలగనాయగన్`, `విశ్వనటుడు` అంటూ ట్యాగ్ ని జోడించి అభిమానంతో పిలచుకోవడం ప్రేక్షకాభిమానులకు ఓ అలవాటు.
By: Tupaki Desk | 11 Nov 2024 11:25 AM ISTకమల్ హాసన్ పేరుకు ముందు `ఉలగనాయగన్`, `విశ్వనటుడు` అంటూ ట్యాగ్ ని జోడించి అభిమానంతో పిలచుకోవడం ప్రేక్షకాభిమానులకు ఓ అలవాటు. చిత్ర పరిశ్రమలో కమల్ హాసన్ సాధించిన విజయా లు.. అందించిన సేవల్ని గుర్తించి ఆ రకంగా ఆయనకు ప్రత్యేకమైన గౌరవం ఇస్తుంటారు. అయితే ఇలా పిలవడం విషయంలో కమల్ సంచనల నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తనని అలా పిలవ కూడదని నిర్ణయించుకున్నారు.
దానికి సంబంధించి ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. `నా పనని మెచ్చి ఉలగ నాయగన్ వంటి ఎన్నో బిరుదులు ఇచ్చింద నందుకు ఎల్లప్పుడు కృతజ్ఞుడిని. ప్రేక్షకులు, తోటి నటీనటులు, ఆత్మీయుల నుంచి వచ్చే ఇలాంటి ప్రశంసలు నా మనసును తాకాయి. నన్నెంతగానో కదలించాయి. ఏ ఒక్క వ్యక్తి ఊహకి అందనిదే సినిమా. అందులో నేను నిత్య విద్యారిని. ఆ రంగంలో ఎన్నో విషయాలు నేర్చుకోవాలని, మరింతగా ఎదగాలని ఆశీస్తున్నాను.
ఇతర కళలు మాదిరిగానే సినిమా కూడా అందరికీ చెందినది. ఎంతో మంది ప్రతిబింబం సినిమా. కళ కంటే కళా కారుడు గొప్ప కాదు అన్నది నా అభిప్రాయం. నేను ఎప్పటికీ స్ధిరంగా ఉండాలనుకుంటున్నా. నాలోపాలు గుర్తించి మెరుగు పరుచుకుంటా. నటుడిగా నా కర్తవ్యాన్ని నిరవర్తించాలనుకుంటున్నా. ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. స్టార్ ట్యాగ్ ని మర్యాద పూర్వకంగా తిరస్కరిస్తున్నా.
నా అభిమానులు, సినీ ప్రముఖులు, భారతీయులంతా నన్ను కేవలం కమల్ హాస్ లేదా కమల్ లేదా కెహెచ్ గా పిలవాలని అభ్యర్దిస్తున్నా. ఎన్నో ఏళ్లగా రకరకాల బిరుదలతో పిలుస్తున్నారు. అందుకు ధన్యవాదాలు. నా మూలాలకు నేను కట్టుబడి ఉండాలని,, నటుడిగా బాధ్యత నిరవర్తించాలనుకుంటున్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా` అని అన్నారు.
కమల్ కంటే ముందు తల అజిత్ కూమార్ కూడా తన ట్యాగ్ ని తొలగించుకున్నారు. తనని కేవలం అజిత్ లేదా అజిత్ కుమార్ లేదా ఏకె అని మాత్రమే పిలవాలన్నారు. అలాగే నాని కూడా నేచులర్ స్టార్ అనే బిరుదుని వ్యతిరేకించారు.
