అవకాశాలు రాకపోతే అద్దెతో బ్రతుకుతాడనా?
ట్యాలెంట్ ఉన్నా అదృష్టం కూడా కలిసొస్తేనే ఇండస్ట్రీలో సక్సెస్ అవుతామన్నది విజయవంతమైన వారు చెప్పేవారి మాట
By: Tupaki Desk | 18 May 2025 10:56 AM ISTబ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతాడో? లేదో గ్యారెంటీ ఉండదు. ట్యాలెంట్ ఉన్నా అదృష్టం కూడా కలిసొస్తేనే ఇండస్ట్రీలో సక్సెస్ అవుతామన్నది విజయవంతమైన వారు చెప్పేవారి మాట. అంతెదుకు అల్లు అర్జున్ నటుడిగా సక్సెస్ అవుతాడని వాళ్ల తాతయ్య అల్లు రామలింగయ్యే నమ్మలే కపోయారు. అందుకే బన్నీపేరిట తాత బ్యాంక్ లో కొంత అమౌంట్ ఎఫ్ డీ కూడా చేసారు.
నటుడిగా సక్సస్ కాకపోతే ఎఫ్ డీ మీద వచ్చే వడ్డీతోనైనా బండి లాంగిచేస్తాడన్నది తాత ధీమా. అప్పట్లో పెద్దవాళ్లు అంత ముందు చూపుతో వ్యవహరించేవారు. ఇలాంటి సన్నివేశం విశ్వనటుడు కమల్ హాసన్ జీవితంలో కూడా ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది. కమల్ హాసన్ సినిమాల్లో ప్రయత్నిస్తున్న రోజుల్లో ఆయన తల్లి రాజ్యలక్ష్మి సొంతంటిలో కొంత భాగాన్ని బైక్ మెకానిక్ షాపుకు అద్దెకు ఇచ్చారుట.
ఎందుకమ్మా అద్దెకు ఇస్తున్నావ్ ? అని కమల్ హాసన్ అడగగా నీ కోసమే అంటూ రాజ్యలక్ష్మి బధులిచ్చింది. దీంతో కమల్ కి ఏం అర్దం కాలేదు. నా కోసం అద్దెకివ్వడం ఏంటని ఆరా తీయగా సినిమాల్లో ప్రయత్నిస్తున్నావ్? అక్కడ సక్సెస్ అవుతావో? ఫెయిలవుతావో తెలియదు. గ్యారెంటీ లేని జీవితం. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు రాకపోతే మెకానిక్ వాడు ఇచ్చే అద్దెతోనైనా బ్రతుకుతాడని అలా చేసానంటూ ఆ తల్లి చెప్పుకొచ్చింది.
ఈ విషయాన్ని కమల్ హాసన్ ఓ మీట్ లో రివీల్ చేసారు. నేడు కమల్ విశ్వనటుడుయ్యారు. బన్నీ ఐకాన్ స్టార్ అయ్యాడు. కోలీవుడ్ ని ఆయనా...టాలీవుడ్ ని బన్నీఏలుతున్నారు. వాళ్ల ఆదాయం ఇప్పుడు సెకన్స్ లో ఉంది. అదీ లక్షల్లో...కోట్లలో సంపాదిస్తున్నారు. ఇండస్ట్రీలో సక్సెస్ అయితే అలాగే ఉంటుంది. ఫెయిలైతే పరిస్థితి అంతే దారుణంగానూ ఉంటుంది.
