సంచలన త్రయానికి కమల్ హాసన్ గ్రీన్ సిగ్నెల్!
ఈ నేపథ్యంలో తాజాగా కమల్ హాసన్ ...మోహన్ లాల్ తో కలిసి నటించడంపై స్పందించారు.
By: Tupaki Desk | 30 May 2025 1:00 AM ISTకంప్లీట్ స్టార్ మోహన్ లాల్-విశ్వనటుడు కమల్ హాసన్ 'ఉన్నై పోల్ ఒరువన్' అనే తమిళ చిత్రంలో తొలి సారి కలిసి నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో విజయం సాధించిన 'వెడ్నెస్టే' చిత్రానికి రీమేక్ అది. ఈసినిమానే తెలుగులో 'ఈనాడు' గా రీమేక్ అయింది. ఇందులో కమల్ హాసన్ తో కలిసి వెంకటేష్ నటించారు. ఆ తర్వాత మళ్లీ కమల్ హాసన్ మోహన్ లాల్ తో మళ్లీ సినిమా చేయలేదు.
అయితే మోహన్ లాల్ నటించిన 'మలైకోట్టై వాలిబన్' గత ఏడాది రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో కమల్ హాసన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. కమల్ ని సంప్రదించగా ఆయన పాజిటివ్ గా స్పందించినట్లు మీడియాలో కథనాలొచ్చాయి. కానీ ఆ సినిమాలో కమల్ హాసన్ నటించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా కమల్ హాసన్ ...మోహన్ లాల్ తో కలిసి నటించడంపై స్పందించారు.
'గతంలో ఇద్దరం కలిసి ఓసినిమా చేసాం. కానీ మళ్లీ ఆయన తో సినిమా చేయలేదు. ఇద్దరం ఒక్క సినిమాకే పరిమితం కావడం నాకు ఇష్టం లేదు. కచ్చితంగా మళ్లి కలిసి పనిచేస్తాం. అందుకు సరైన కథ కుదరాలని బధులిచ్చారు. అలాగే మమ్ముట్టితో కలిసి నటించడం కూడా వీలు పడటం లేదని కమల్ గుర్తు చేసారు. ఆయనతోనూ సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు.
మరి కమల్-మమ్ముట్టి- మోహన్ లాల్ కలిసి పనిచేసేది ఎప్పుడు? అంటే ఆ త్రయం ఇప్పటికే కలిసి పనిచేసింది. అయితే అది సినిమా కోసం కాదు. ఓ వెబ్ సిరీస్ కోసం. 'మనోరతంగల్ అనే మలయాళీ సిరీస్ లో ఈ త్రయం నటించింది. ఇది తొమ్మిది కథల సమూహం.ఎంటీ వాసుదేవన్ నాయర్ రచన ఆధారంగా తెరకెక్కింది. ఇందులో మోహన్‌లాల్, మమ్ముట్టి మరియు ఫహద్ ఫాసిల్ నటించారు.
