పడిపోయిన చిత్రం మళ్లీ పైకి లేచిందిలా?
మూడు దశాబ్ధాల తర్వాత కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్లో సినిమా ప్రకటన ఒక్కసారిగా అంచనాలు పీక్స్ కి వెళ్లాయి.
By: Tupaki Desk | 19 May 2025 11:31 AM ISTమూడు దశాబ్ధాల తర్వాత కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్లో సినిమా ప్రకటన ఒక్కసారిగా అంచనాలు పీక్స్ కి వెళ్లాయి. అందుకు తగ్గట్టు కమల్ పాత్రపై రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆసక్తిని రెట్టింపు చేసాయి. 'నాయకుడు' తర్వాత ఇద్దరు మరో పెద్ద అద్భుతం చేయబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. అటుపై షూటింగ్ మొదలైన తర్వాత సినిమా గురించి ఎలాంటి హడావుడి కనిపించలేదు.
దీంతో మొదలైన అంచనాలు ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. అప్ డేట్ కూడా లేకపోవడంతో థగ్ లైఫ్ పై ఎక్కడా ఎలాంటి చర్చకు తావు లేకుండా పోయింది. చిత్రీకరణ పూర్తయిన అనంతరం కూడా ఎలాంటి అప్ డేట్ అందించలేదు. రిలీజ్ విషయంలో కూడా క్లారిటీ లేకపోవడంతో? బజ్ మరింత డౌన్ అయింది. అయితే ఒక్క ట్రైలర్ తో 'థగ్ లైఫ్' ని మళ్లీ అలా పైకి లేపారు. ట్రైలర్ కూడా ఎలాంటి అంచనాలు లేకుండానే రిలీజ్ అయింది. కానీ రిలీజ్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ట్రైలర్ ప్రేక్షకుల్ని థ్రిల్ చేసింది.
రేర్ కాంబినేషన్ చేతులు కలిపితే ఎలా ఉంటుందో చిన్న ట్రైలర్ తోనే ప్రూవ్ చేసారు. కమల్ రోల్... అందులో ఎమోషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. కమల్ -శింబు మధ్య ఘర్ణణ వాతావరణం ఎంతో బలంగా కనిపిస్తుంది. నాజర్, జోజు జార్జ్ వంటి సహాయ నటులు కూడా తమ ఆసక్తికరమైన పాత్రలతో బలమైన ముద్ర వేశారు. గ్యాంగ్ స్టర్ డ్రామాలో బలమైన ఎమోషన్ కూడా హైలైట్ అవుతుంది.
అన్నింటిని మించి కమల్ -అభిరామి మధ్య లిప్ లాక్ పెను సంచలనమే అయింది. విమర్శలు వ్యక్తమైనప్పటికీ ఆ విమర్శలే కోట్ల రూపాయల పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి. కమల్ అభిమానుల ఎటాకింగ్ కూడా సినిమాకు కలిసొచ్చింది. ఈ అంశాలన్ని థగ్ లైఫ్ ని ట్రెండింగ్ లో నిలిచేలా చేసాయి. దీంతో పడపోయిన అంచనాలు మళ్లీ మొదలయ్యాయి. థగ్ లైఫ్ ని జూన్ 5న రిలీజ్ చేస్తున్నారు. పోటీగా సినిమాలు కూడా లేవు. దీంతో ఈసినిమాకు భారీ ఓపెనింగ్స్ కి తిరుగులేదు. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటూ వసూళ్ల పరంగానూ చూసే పనిలేదు.
