దారి తప్పి అడవిలో చిక్కుకున్న కమల్-శ్రుతి హాసన్!
అంత దూరం నడిచిన తర్వాత ఓ గొర్రెల కాపరి కనిపించడంతో అడవి నుంచి బయటకు ఎలా వెళ్లాలో తెలుసుకుని..అతడి సహాయంతో బయట పడినట్లు తెలిపారు.
By: Tupaki Desk | 16 May 2025 8:30 AM ISTవిశ్వనటుడు కమల్ హాసన్, శింబు, త్రిష ప్రధాన పాత్రల్లో మణిరత్నం 'థగ్ లైఫ్' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగు తున్నాయి. అన్ని పనులు పూర్తి చేసి జూన్ లో చిత్రాన్ని రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. కొన్ని దశాబ్ధాల తర్వాత కమల్-మణిసార్ కాంబినేషన్ లో రిలీజ్ అవుతున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతోనూ మంచి బజ్ క్రియేట్ అయింది. చిత్రీకరణలో భాగంగా అటవీ ప్రాంతం లోనూ చాలా సన్నివేశాలు చిత్రీకరించారు. చీమలు దూరని చిట్టడివి..కాకులు దూరని కారడివిలో కొన్ని కీలకమై ఎపిసోడ్స్ షూట్ చేసారు. అయితే ఈ సమయంలో కమల్ హాసన్, శ్రుతి హాసన్ అడవిలో దారి తప్పినట్లు తాజాగా వెల్లడించారు. దారి తప్పి దాదాపు 30 మైళ్లు నడుచుకుని వెళ్లిపోయినట్లు తెలిపారు.
అంత దూరం నడిచిన తర్వాత ఓ గొర్రెల కాపరి కనిపించడంతో అడవి నుంచి బయటకు ఎలా వెళ్లాలో తెలుసుకుని..అతడి సహాయంతో బయట పడినట్లు తెలిపారు. ఇంత వరకూ ఈ విషయాన్ని కమల్ ఎక్కడా రివీల్ చేయలేదు. సాధారణంగా ఇలాంటి విషయాలు సోషల్ మీడియాలో తిరిగి ఇంటికొచ్చాక షేర్ చేసు కుంటారు. కానీ కమల్ మాత్రం గోప్యంగా ఉంచారు. రిలీజ్ సమయం దగ్గర పడటంతో విషయాన్ని చెప్పి తగ్ లైఫ్ అటెన్షన్ డ్రా చేసారు.
ప్రస్తుతం కమల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అప్పుడప్పుడు నటీనటులకు ఈరకమైన అనుభవాలు సహజం. దట్టమైన అటవిలో షూటింగ్ అంటే కొంత రిస్క్ తో కూడకున్నదే. సెట్స్ వేసి చేసే వెసులు బాటు ఉన్నా రియలిస్టిక్ ఎక్స్ పీరియన్స్ కోసం ఒరిజినల్ లోకేష్ పై ఆసక్తి చూపిస్తారు. అందులో మణిరత్నం స్పెషలిస్ట్. ఆయన సినిమాలన్నీ ఒరిజినల్ లొకేషన్స్ లోనే ఉంటాయి. సెట్లు వేయడం అన్నది చాలా అరుదు.
