Begin typing your search above and press return to search.

థగ్ లైఫ్ మరో విక్రమ్ అవుతుందా..?

లోకనాయకుడు కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో మూడు దశాబ్దాల క్రితం నాయకుడు సినిమా వచ్చింది.

By:  Tupaki Desk   |   25 May 2025 9:00 AM IST
థగ్ లైఫ్ మరో విక్రమ్ అవుతుందా..?
X

లోకనాయకుడు కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో మూడు దశాబ్దాల క్రితం నాయకుడు సినిమా వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఇద్దరు కలిసి థగ్ లైఫ్ సినిమా చేశారు. ఈ గ్యాప్ లో ఎవరికి వారు తమ స్థాయికి తగ్గ సినిమాలతో శిఖరాగ్రానికి చేరుకున్నారు. ముఖ్యంగా నటనలో ఇప్పటికీ శిక్షణ తీసుకుంటూ కమల్ హాసన్ వృత్తి పట్ల చూపించే డెడికేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మణిరత్నం కూడా న్యూ ఏజ్ ఆడియన్స్ కి తగినట్టుగా సినిమాలు చేస్తున్నారు.

ఈ కాంబినేషన్ లో సినిమా అంటే మూవీ లవర్స్ కి పండుగ అన్నట్టే లెక్క. రెండు వారాల్లో రిలీజ్ అవబోతున్న థగ్ లైఫ్ సినిమా మీద రిలీజైన ట్రైలర్ అంచనాలు పెంచింది. కమల్ హాసన్ మరోసారి యాక్షన్ ప్యాక్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టబోతున్నారని అర్ధమవుతుంది. ఈ సినిమాలో కమల్ తో పాటు శింబు కూడా తన మార్క్ నటనతో ఆకట్టుకోనున్నారు. కమల్ హాసన్ కెరీర్ లో ఫాం లో లేని టైం లో విక్రం సినిమా వచ్చి సంచలనాలు సృష్టించింది.

లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన విక్రం కమల్ హాసన్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన విక్రం కమల్ ఫ్యాన్స్ కి ఒక మర్చిపోలేని కిక్ ఇచ్చింది. ఐతే విక్రం తర్వాత కమల్ మళ్లీ సినిమాలైతే చేస్తున్నా ఆ స్థాయి విజయం రాలేదు. ఐతే మణిరత్నం తో చేసిన థగ్ లైఫ్ తో మరోసారి ఆ రేంజ్ సక్సెస్ అందుకుంటారని కాన్ ఫిడెన్స్ కనిపిస్తుంది.

థగ్ లైఫ్ ప్రమోషన్స్ లో కమల్ కూడా ఈ సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయి. ఇలాంటి సినిమా ప్రేక్షకులకు చేరువవ్వాలనే ప్రమోషన్స్ బాగా చేస్తున్నామని అన్నారు. థగ్ లైఫ్ సినిమాలో అభిరామి, త్రిష నటించారు. సినిమాకు రెహమాన్ మ్యూజిక్ కూడా మరో హైలెట్ కానుంది. మరి మణిరత్నం, కమల్ హాసన్ కాంబో లో వస్తున్న ఈ థగ్ లైఫ్ విక్రం ని బీట్ చేస్తుందా లేదా అన్నది జూన్ 5 న తెలుస్తుంది. కమల్ హాసన్ కాన్ఫిడెన్స్ ని చూస్తుంటే సినిమా తప్పకుండా ఊహించని రేంజ్ విజయాన్ని అందుకునేలా ఉందనిపిస్తుంది. థగ్ లైఫ్ సినిమాను తెలుగులో శ్రేష్ట్ మూవీస్ రిలీజ్ చేస్తున్నారు.