Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ హాస‌న్‌తో లింగుస్వామి వివాదానికి కార‌ణం?

అయితే ఉత్త‌మ విల‌న్‌కు లింగుసామి కఠినమైన కట్‌ల‌తో మార్పులను సూచించడం ద్వారా ప్రాజెక్ట్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి తన వంతు కృషి చేశానని పేర్కొన్నాడు.

By:  Tupaki Desk   |   10 Jun 2025 8:00 AM IST
క‌మ‌ల్ హాస‌న్‌తో లింగుస్వామి వివాదానికి కార‌ణం?
X

క‌మ‌ల్ హాస‌న్- లింగు స్వామి కాంబినేష‌న్ లో `ఉత్త‌మ విల‌న్` సినిమా కొన్నేళ్ల క్రితం ప్రారంభ‌మై చాలా వివాదాల్ని ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. క‌మ‌ల్ హాస‌న్ తో, నిర్మాత లింగుస్వామి విభేధాలు తారా స్థాయికి చేరుకోవ‌డంతో ఆ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే చాలా చిక్కుల్ని ఎదుర్కొంది. నిజానికి క‌మ‌ల్ హాస‌న్‌ పదే ప‌దే స్క్రిప్టు మార్చ‌డమే ప‌రాజ‌యానికి కార‌ణ‌మ‌ని లింగుస్వామి వాదించారు. క‌మ‌ల్ హాస‌న్ లెజెండ‌రీ న‌టుడు అన‌డంలో సందేహం లేదు కానీ ఆయ‌న సృజ‌నాత్మ‌క స్వేచ్ఛ చాలా ఖ‌రీదైన‌ద‌ని, ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హార‌మ‌ని లింగుస్వామి అభివ‌ర్ణించారు. `ఉత్తమ విలన్` చిత్రీకరణ సమయంలో జరిగిన విష‌యాల‌ను యూట్యూబ్ చానెల్ ఇంట‌ర్వ్యూలో వివ‌రించారు.

తాము దేవర్ మగన్ లేదా అపూర్వ సగోదరర్గల్ వంటి గొప్ప ఎమోష‌న్స్ ఉన్న చిత్రాన్ని చేయాల‌ని భావించాం. కమల్ సర్ మొదట్లో ఒక వ్యక్తి తన సోదరుడిని రక్షించడం గురించి ఒక బలవంతపు కథను రూపొందించారు. సిద్ధార్థ్ సోదరుడిగా న‌టించాల్సి ఉంది. కానీ చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న‌ప్పుడు అతడు దాదాపు ప్రతి వారం స్క్రిప్ట్‌ను తిరిగి రాస్తూనే ఉన్నాడు. ఈ అనూహ్య శైలి గతంలో కమల్‌కు గ‌తంలో పనిచేసినా కానీ, మా తిరుపతి బ్రదర్స్ బ్యాన‌ర్‌ను స్థిరత్వం కోసం ఊపిరి పీల్చుకునేలా చేసిందని అన్నారు.

ఉత్త‌మ విల‌న్ ఆడ‌క‌పోతే, ముప్పై కోట్ల తక్కువ బడ్జెట్‌తో మరో సినిమా చేయడం ద్వారా పరిహారం చెల్లిస్తానని కమల్ హామీ ఇచ్చినప్పటికీ నష్టం అప్పటికే జరిగిపోయిందని లింగుసామి అన్నారు. నేను ఈ సినిమాలో పూర్తిగా దిగిపోయి పెట్టుబడి పెట్టాను. కానీ బిల్లును చెల్లిస్తున్నప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. తాను, ఉత్త‌మ విల‌న్ సహ నిర్మాత సుభాష్ చంద్రబోస్ మలయాళ హిట్ `దృశ్యం` చిత్రాన్ని రీమేక్ చేయాలని ప్రణాళికలు వేసుకున్నామ‌ని వెల్లడించాడు. కమల్ సర్ కి ఈ సినిమాను చూపించాము. ఆయన దర్శకత్వం వహిస్తారని ఆశించాము. కానీ ఆయన దానిని తిరస్కరించారు. తరువాత మరొక నిర్మాణ సంస్థతో చేయడానికి మాత్రమేన‌ని లింగుసామి ద్రోహం చేసినట్లు సూచిస్తూ అన్నారు.

అయితే ఉత్త‌మ విల‌న్‌కు లింగుసామి కఠినమైన కట్‌ల‌తో మార్పులను సూచించడం ద్వారా ప్రాజెక్ట్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి తన వంతు కృషి చేశానని పేర్కొన్నాడు. కానీ త‌న సూచ‌న‌ల్ని క‌మ‌ల్ హాస‌న్ స్వీక‌రించ‌లేద‌ని, అలాగే సినిమాని రిలీజ్ చేసామ‌ని తెలిపారు. ఉత్త‌మ విల‌న్ లాభ‌దాయ‌క‌మైన ప్రాజెక్ట్ అని ప్ర‌చారం సాగినా అది త‌ప్పుడు ప్ర‌చార‌మ‌ని లింగుస్వామి వెల్ల‌డించారు.