Begin typing your search above and press return to search.

'ఆకలి రాజ్యం'లోని ఆ సీన్‌ నిజంగా జరిగింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ చిన్న వయసులోనే బాల నటుడిగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   16 May 2025 4:00 AM IST
ఆకలి రాజ్యంలోని ఆ సీన్‌ నిజంగా జరిగింది
X

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ చిన్న వయసులోనే బాల నటుడిగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం తెల్సిందే. బాల నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న కమల్‌ హాసన్‌ హీరోగా సునాయాసంగానే ఇండస్ట్రీలో అడుగు పెట్టారని అంతా అనుకుంటారు. కానీ కమల్‌ హాసన్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడని అంటూ ఉంటారు. ఆయన కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్స్ చూశాడు. అలాగే ఆయన చాలా ఫ్లాప్స్‌ను కూడా చూశాడు. ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి కమల్‌ హాసన్‌ పడ్డ కష్టం గురించి ప్రముఖంగా మాట్లాడుకుంటూ ఉంటారు. తాజాగా కమల్‌ హాసన్‌ థగ్‌ లైఫ్‌ సినిమాను చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.

సినిమా విడుదల నేపథ్యంలో కమల్‌ హాసన్‌ ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూలో కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ... సినిమాల్లో హీరోగా నటించక ముందు ఇంట్లో ఒక విషయమై గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగా అమ్మతో మాట్లాడలేదు. ఇంట్లోంచి బయటకు వెళ్లి పోయాను. అమ్మపై కోపంతో తాను బార్బర్‌ షాప్‌లో పని చేశాను. బార్బర్‌గా చేస్తున్న సమయంలో చాలా విభిన్నమైన అనుభవాలు ఉండేవని, ఆ రోజులను కమల్‌ హాసన్ గుర్తు చేసుకున్నాడు. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత కొన్ని ఒడిదొడుకులు అనేవి ఎదురు అయ్యాయి అన్నాడు. చిన్న వయసులో నటించేప్పుడు సరదాగా అనిపించేదని కమల్‌ హాసన్‌ చెప్పుకొచ్చాడు.

చిన్నతనంలో అమ్మపై కోపంతో బార్బర్‌ షాప్‌లో పని చేసిన విషయాన్ని దర్శకుడు బాలచందర్‌ సర్‌కి చెప్పడంతో ఆయన ఆకలి రాజ్యం సినిమాలో అదే సీన్‌ను పెట్టారు. ఆకలి రాజ్యం సినిమా క్లైమాక్స్‌లో నేను చిన్నప్పుడు ఏదైతే చేశానో దాన్నే దర్శకుడు పెట్టారని కమల్‌ హాసన్‌ చెప్పారు. కమల్‌ హాసన్‌ ప్రస్తుతం చేస్తున్న థగ్‌ లైఫ్‌ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న థగ్‌ లైఫ్‌ సినిమా చాలా విభిన్నంగా ఉంటుందని ఫస్ట్‌ లుక్‌ విడుదలైనప్పటి నుంచే అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. అంచనాలను అందుకునే విధంగా సినిమా ఉంటుంది అనే విశ్వాసంను మేకర్స్‌తో పాటు, ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

థగ్‌ లైఫ్‌ సినిమా షూటింగ్‌ పూర్తి అయినప్పటికీ గ్రాఫిక్స్ వర్క్‌కి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ జూన్‌లో సినిమా విడుదల చేయాలని భావించినా ఇండియా, పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు ఇండియన్‌ 3 సినిమాతో కూడా కమల్‌ హాసన్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ 2 సినిమా ఆశించిన స్థాయిలో పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకోలేదు. అందుకే ఇండియన్‌ 3 సినిమా ఇప్పటి వరకు విడుదల కావడం లేదు. ముందు ముందు అయినా ఇండియన్‌ 3 విడుదల అవుతుందా అనేది చూడాలి.