Begin typing your search above and press return to search.

కమల్ కాంట్రవర్సీ.. శివన్నను నిందించడమెందుకు?

తమిళ భాష నుంచి కన్నడ పుట్టిందంటూ స్టార్ హీరో కమల్ హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు.. ఎలాంటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. బేషరతుగా కమల్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   2 Jun 2025 11:04 AM IST
Kamal Haasan’s Language Remark Sparks Kannada Backlash
X

తమిళ భాష నుంచి కన్నడ పుట్టిందంటూ స్టార్ హీరో కమల్ హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు.. ఎలాంటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. బేషరతుగా కమల్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కన్నడ ఫిల్మ్ ఛాంబర్ కూడా డిమాండ్ చేసింది. థగ్ లైఫ్ మూవీని అడ్డుకుంటామని వార్నింగ్ ఇప్పటికే ఇచ్చింది.

అంతే కాదు.. కమల్ లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్ బుకింగ్స్ కూడా అక్కడ ప్రారంభమవ్వలేదు. అలా ఉంది అక్కడ పొజిషన్. కానీ కమల్ మాత్రం సారీ చెప్పలేదు. చెప్పనని అంటున్నారు. ప్రేమ ఎప్పుడూ క్షమాపణ కోరదని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనని తేల్చి చెప్పారు. దీంతో ఆ విషయం ఇప్పుడు తారాస్థాయికి చేరిందని చెప్పాలి.

అయితే కమల్.. కన్నడపై వ్యాఖ్యలు చేసినప్పుడు స్టార్ హీరో శివరాజ్ కుమార్ అక్కడే ఉన్నారు. దీంతో ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎక్కడికెళ్లినా ఆయనకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అదే సమయంలో కమల్ కామెంట్స్ చేసినప్పుడు శివరాజ్ కుమార్ చప్పట్లు కొట్టినట్లు కొన్ని వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దానిపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను కమల్ వ్యాఖ్యలు చేసిన సమయంలో చప్పట్లు కొట్టలేదని శివరాజ్ కుమార్ తెలిపారు. అవి ఎడిట్ చేసిన వీడియోలని చెప్పారు. కన్నడ కోసం తాను ప్రాణాన్ని అయినా ఇస్తానని చెప్పారు. ఎవరో తప్పుదారి పట్టించే వీడియోలు వైరల్ చేస్తున్నారని శివరాజ్ కుమార్ అన్నారు.

అంతకుముందు ఓ కార్యక్రమంలో.. కమల్ తనకు ఆరాధ్యుడని తెలిపారు. ఆయనకు కన్నడ, బెంగళూరుపై గౌరవం ఉందని పేర్కొన్నారు. భాషాభిమానం అనేది కేవలం మాటలకే పరిమితం కాకూడదని కూడా చెప్పారు. కమల్ హాసన్‌ పై తీర్పు చెప్పడం తన ఉద్దేశం కాదని, కన్నడ భాషకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

దీంతో కమల్ హాసన్ కాంట్రవర్సీపై శివరాజ్ కుమార్ సరైన విధంగా స్పందిస్తున్నారని చెప్పాలి. వివాదాన్ని సద్దుమణిగే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. కానీ అదే సమయంలో ఆయన నిందించడం కరెక్ట్ కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆయన చాలా సౌమ్యుడు అని.. కొందరు ఆయనపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆపుకోవాలని సూచిస్తున్నారు.