ఇద్దరు దర్శకులతో కమల్ భారీ యాక్షన్ అడ్వెంచర్!
ట్యాలెంటెడ్ టెక్నీషియన్లను వెతికి పట్టుకోవడంలో విశ్వనటుడు కమల్ స్పెషల్ లిస్ట్. ట్యాలెంట్ ఉందంటే? ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు.
By: Tupaki Desk | 14 April 2025 11:23 AM ISTట్యాలెంటెడ్ టెక్నీషియన్లను వెతికి పట్టుకోవడంలో విశ్వనటుడు కమల్ స్పెషల్ లిస్ట్. ట్యాలెంట్ ఉందంటే? ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు. తాజాగా మరో ద్వయాన్ని దర్శకులుగా పరిచయం చేయడానికి రెడీ అవుతున్నారు. `విక్రమ్` సినిమాకు అన్బు-అరీవ్ అనే ఇద్దరు స్టంట్ కొరియోగ్రాఫర్లు స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు డిజైన్ చేసారు. విక్రమ్ లో ప్రతీ ఫైట్ ఎంతో క్రియేటివ్ గా ఉంటుంది. ఫైట్ వెనుక ఓ కాన్సెప్ట్ ఉంటుంది.
ఇదే విషయాన్ని పసిగట్టిన కమల్ వాళ్లని దర్శకులుగా పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారు. వాళ్ల దర్శకత్వంలో తానే హీరోగా ఓ భారీ యాక్షన్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ లో నిర్మించడానికి రెడీ అయ్యారు. ఇది భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాలో పాత్ర కోసం కమల్ హాసన్ బరువు కూడా తగ్గుతున్నారుట.
ఆ పాత్రకు బాగా సన్నగా ఉండాలని మేకర్స్ సూచించ డంతో? అందుకు తగ్గట్టు కమల్ రెడీ అవుతు న్నారుట. స్పెషల్ డైట్ ఫాలో అవుతున్నారుట. బరువు వేగంగా తగ్గాల్సి రావడంతో చాలా పరిమితంగానే ఆహారం తీసుకుంటున్నారుట. ఎక్కువగా నీళ్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాకు `కెహెచ్ 237` అనేది వర్కింగ్ టైటిల్ గా నిర్ణయించారు. ఈ చిత్రం ఇదే ఏడాది పట్టాలెక్కుతుంది.
ఇప్పటికే కమల్ హాసన్ `థగ్ లైఫ్` షూటింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. మణిరత్నం దర్శకత్వం వహిస్తోన్న చిత్రం జూన్ లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కమల్ హాసన్ ఇంకా డబ్బింగ్ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే ఎసీయూ యూనివర్శ్ లో పనిచేయడానికి కమల్ సిద్దంగా ఉన్నారు.
