ఇండియన్-3.. ఇదొక్కటే మార్గం!
విశ్వనటుడు కమల్ హాసన్ ఐకానిక్ హిట్ సినిమాల్లో ఇండియన్ మూవీ ఒకటి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఆ సినిమా.. 1996లో రిలీజ్ అయ్యి ఓ రేంజ్ లో హిట్ అయింది.
By: Tupaki Desk | 18 July 2025 11:26 AM ISTవిశ్వనటుడు కమల్ హాసన్ ఐకానిక్ హిట్ సినిమాల్లో ఇండియన్ మూవీ ఒకటి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఆ సినిమా.. 1996లో రిలీజ్ అయ్యి ఓ రేంజ్ లో హిట్ అయింది. ఆ మూవీలో కమల్ హాసన్ సేనాపతి రోల్ లో కనిపించి తన యాక్టింగ్ తో వేరే లెవెల్ లో అదరగొట్టారు.
ఆ తర్వాత ఇండియన్ మూవీకి సీక్వెల్ ఇండియన్-2ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఇండియన్-3ని కూడా ప్లాన్ చేశారు. కానీ అనేక ఏళ్ల గ్యాప్ తర్వాత రిలీజ్ అయిన ఇండియన్-2.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా.. మూవీ లవర్స్, అభిమానుల అంచనాలను అస్సలు అందుకోలేకపోయింది.
విడుదలకు ముందే ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ అయినా.. సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో రిజల్ట్ అందుకోలేకపోయింది. దీంతో ఇండియన్-3పై అందరికీ అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. సినిమా రిలీజ్ అవ్వదని కొందరు.. ఓటీటీలో రిలీజ్ అవుతుందని మరికొందరు అన్నారు. ఇంకొందరు పూర్తి ప్రాజెక్ట్ కే స్వస్తి పలికేశారని అన్నారు.
కానీ మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. ఆ మధ్య శంకర్ మాత్రం ఇండియన్-3 వస్తుందనే చెప్పారు. అయితే ప్రస్తుతానికి కొన్ని సీన్స్ తో పాటు ఒక సాంగ్ షూటింగ్ పెండింగ్ ఉందని తెలుస్తోంది. ఇప్పుడు షూటింగ్ మొదలు కానున్నట్లు సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అవ్వనుందట.
అదే సమయంలో ఇండియన్-3 మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా భాగం కంప్లీట్ అయింది. కాస్త మాత్రమే పెండింగ్ ఉంది. దీంతో బడ్జెట్ తిరిగి పొందాలంటే థియేటర్లలో విడుదల చేయడం మేకర్స్ కు ఒక్కటే మార్గమని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. కాబట్టి థియేటర్స్ లో ఇండియన్-3 సినిమా రిలీజ్ చేయడం జరగాల్సిందేనని చెప్పాలి.
అయితే పార్ట్-3లో సేనాపతి ఉగ్రవాదిగా మారడానికి కారణాలు, బ్రిటిషర్లతో చేసిన యుద్ధాలు సహ పలు అంశాలు ఉండనున్నాయి. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన సాంగ్స్ కూడా ఉండనున్నాయి. కాజల్ అగర్వాల్ సందడి చేయనుంది. కానీ పార్ట్-2 ఫ్లాప్ అవ్వడంతో మూడో భాగంపై ఎలాంటి హైప్ లేదు. క్రేజ్ లేకుండా పోయింది. మరి మేకర్స్ ఏం చేస్తారో.. ఎప్పుడు రిలీజ్ చేస్తారో వేచి చూడాలి.
