Begin typing your search above and press return to search.

ఇండియన్‌ 3 వచ్చే ఛాన్స్ ఉందా...!

ఇండియన్ 2 విషయంలో తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ ఇండియన్‌ 3 విషయంలో కొందరిలో పాజిటివ్‌ హోప్స్ ఉన్నాయి.

By:  Tupaki Desk   |   28 July 2025 11:39 AM IST
ఇండియన్‌ 3 వచ్చే ఛాన్స్ ఉందా...!
X

కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో నటించిన 'భారతీయుడు' సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా వచ్చి దశాబ్దాలు దాటినా ఇప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన, ఆధరణ దక్కించుకుంటూ ఉంది. అలాంటి భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ అంటూ దర్శకుడు శంకర్‌ తీసుకు వచ్చిన 'ఇండియన్ 2' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. శంకర్ స్థాయిని మరింతగా దిగజార్చిన సినిమాగా ఇండియన్‌ 2 సినిమా నిలిచింది. సినిమాకు వచ్చిన నెగిటివిటీ, బ్యాడ్‌ రివ్యూల నేపథ్యంలో దర్శకుడు శంకర్‌ సినిమాలు మానేయడం ఉత్తమం అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక సినిమాను ఇంత చెత్తగా తీయవచ్చా అనేందుకు ఉదాహరణగా ఇండియన్‌ 2 ఉంటుందని సోషల్‌ మీడియాలో కొందరు కామెంట్స్ చేశారు.

ఇండియన్ 2 విషయంలో తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ ఇండియన్‌ 3 విషయంలో కొందరిలో పాజిటివ్‌ హోప్స్ ఉన్నాయి. ఇండియన్ 2 సినిమా మొత్తం చూసిన తర్వాత చివర్లో వచ్చిన ఇండియన్‌ 3 ట్రైలర్‌ కాస్త ఆకట్టుకుంది. సినిమా మొత్తంతో పోల్చితే ట్రైలర్‌ బాగుంది కదా అని చాలా మంది అనుకున్నారు. పైగా చిత్ర యూనిట్‌ సభ్యులు సైతం అసలు మ్యాటర్‌ ఇండియన్‌ 3 లో ఉందని చెబుతూ వచ్చారు. దాంతో ఇండియన్‌ 3 పై ఆసక్తి పెరిగింది. శంకర్‌ దర్శకత్వంలో ఆ తర్వాత వచ్చిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా ఫ్లాప్‌ కారణంగా ఇండియన్‌ 3 విషయంలోనూ ఆసక్తి తగ్గుతూ వచ్చింది. సినిమాను ప్రేక్షకులు అక్కర్లేదు అనుకుంటున్నారు అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది.

దర్శకుడు శంకర్‌ తిరిగి పుంజుకోవాలంటే, తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ను చేయాలంటే ఒక విజయం కావాలి. అది ఇండియన్‌ 3 అవుతుందని ఆయన భావిస్తున్నట్లుగా ఉన్నాడు. అందుకే నిర్మాతలతో మాట్లాడుతూ ఇండియన్‌ 3 సినిమా విడుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. షూటింగ్‌ పూర్తి అయింది, కాస్త పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ మిగిలి ఉంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ విషయంలోనూ కాస్త అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా చేయాల్సి ఉంది. నిర్మాతలు కొంత బడ్జెట్‌ పెడితే ఇండియన్‌ 3 ను బయటకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు శంకర్‌ అదే విషయమై చర్చలు జరుపుతున్నాడని, నిర్మాతలతో త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇండియన్‌ 3 సినిమాను కాస్త ఆలస్యంగా అయినా థియేటర్ల ద్వారా విడుదల చేసే ఉద్దేశంతో ఉన్నట్లు నిర్మాతలు చెప్పుకొచ్చారు. శంకర్‌ సైతం అదే విషయమై ఆసక్తిగా ఉన్నాడు. కనుక వెంటనే కాకున్నా కాస్త ఆలస్యంగా అయినా ఇండియన్‌ 3 సినిమా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి. కోలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్‌ 3 ను 2025 చివర్లో విడుదల చేసే విధంగా దర్శకుడు శంకర్‌ తో పాటు, నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకోసం కమల్‌ హాసన్‌తోనూ వారు చర్చలు జరిపారట. ఇండియన్‌ 2 ఫలితం నేపథ్యంలో ఇండియన్‌ 3 ను డైరెక్ట్‌ ఓటీటీ కి ఇవ్వడం మంచి నిర్ణయం అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇండియన్‌ 3 థియేటర్ లలో వచ్చే ఛాన్స్‌ కనిపిస్తున్నాయి. అది ఎప్పుడు అనేది కాలమే నిర్ణయించాలి.