Begin typing your search above and press return to search.

కమల్ నెక్స్ట్ ఏం చేస్తాడు..?

విక్రం సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చిన కమల్ హాసన్ ఆ తర్వాత చేస్తున్న సినిమాలతో మళ్లీ ఫ్లాప్ బాట పట్టారు.

By:  Tupaki Desk   |   10 Jun 2025 10:50 PM IST
కమల్ నెక్స్ట్ ఏం చేస్తాడు..?
X

విక్రం సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చిన కమల్ హాసన్ ఆ తర్వాత చేస్తున్న సినిమాలతో మళ్లీ ఫ్లాప్ బాట పట్టారు. విక్రం సినిమా ఇచ్చిన జోష్ తో మళ్లీ వరుస ప్రాజెక్ట్ లు చేశారు కమల్. ఆగిపోయింది అనుకున్న ఇండియన్ 2 సినిమా పూర్తి చేసి రిలీజ్ చేశారు. అదే కాదు ఇండియన్ 3 సినిమాను కూడా సిద్ధం చేశారు. ఇండియన్ 2 సక్సెస్ అయితే ఇండియన్ 3 వెంటనే వదిలే వారు కానీ ఇండియన్ 2 డిజాస్టర్ అవ్వడం వల్ల ఆగిపోయారు.

ఇక మణిరత్నం తో దాదాపు 3 దశాబ్దాల తర్వాత చేసిన థగ్ లైఫ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఆ మూవీ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. థగ్ లైఫ్ సినిమా మరో విక్రం అవుతుందని ఆశించిన కమల్ ఆశలు నెరవేరలేదు. ఐతే విక్రం ముందు కూడా కమల్ హాసన్ సినిమాల పరిస్థితి ఇలానే ఉండేది. ఏ సినిమా చేసినా అది అంచనాలను అందుకునేది కాదు. విక్రం కూడా లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చింది కాబట్టి ఆ సినిమా సంచలనాలు సృష్టించింది.

ఐతే కమల్ హాసన్ మళ్లీ తిరిగి సక్సెస్ ఫాంలోకి రావాలంటే మళ్లీ విక్రం లాంటి సినిమా పడాలి. అది ఎప్పుడు ఎవరితో వస్తుంది అన్నది చూడాలి. ప్రస్తుతం కమల్ నెక్స్ట్ సినిమా డిస్కషన్స్ జరుగుతున్నాయి. కమల్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఎవరు ఆ సినిమా ఎలా ఉంటుంది అన్న విషయాలు ఏవి బయటకు రాలేదు. కమల్ హాసన్ మాత్రం థగ్ లైఫ్ కు ఆడియన్స్ ఇచ్చిన రిజల్ట్ తో షాక్ లో ఉన్నారని చెప్పొచ్చు.

మళ్లీ కమల్ హాసన్ లోకేష్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందా అంటే ఇప్పుడప్పుడే కష్టమని తెలుస్తుంది. లోకేష్ కాకపోయినా నెల్సన్, కార్తీక్ సుబ్బరాజ్ ఇలా తమిళంలో ప్రస్తుతం ఫాం లో ఉన్న దర్శకులతో కమల్ సినిమా పడితే కచ్చితంగా మరో సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉంటుంది. కమల్ హాసన్ ఫ్యాన్స్ కూడా ఆయన తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కితే చూడాలని కోరుతున్నారు.

ప్రస్తుతం ఇండియన్ 2 టైం లోనే పూర్తి చేసిన ఇండియన్ 3 రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తారా లేదా థియేట్రికల్ రిలీజ్ ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఇండియన్ 2 చివర్లో వదిలిన ఇండియన్ 3 టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఇండియన్ 3 తోనే కమల్ తిరిగి కంబ్యాక్ అవుతారేమో చూడాలి.