కోలీవుడ్ లో 'దృశ్యం-3'..మళ్లీ రంగంలోకి కమల్!
విశ్వనటుడు కమల్ హాసన్ ఇటీవలే `థగ్ లైఫ్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 July 2025 9:00 PM ISTవిశ్వనటుడు కమల్ హాసన్ ఇటీవలే `థగ్ లైఫ్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో విఫలమైంది. మరిప్పుడు కమల్ ఏం చేస్తున్నట్లు? అంటే ప్రస్తుతానికి అతడి చేతుల్లో కొత్త కమిట్ మెంట్లు ఏవీ లేవు. సొంత బ్యానర్లో ఇతర హీరోలతో సినిమాలు నిర్మించడం తప్ప ఆయన మాత్రం ఏ సినిమాకు సైన్ చేయలేదు. ఈ నేపథ్యంలో `దృశ్యం 3` పై ఆసక్తిగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇటీవలే మాతృక దర్శకుడు జీతు జోసేఫ్ `దృశ్యం 3`ని ప్రకటించింన సంగతి తెలిసిందే. మలయాళంతో పాటు తెలుగు, హిందీలో కూడా చేస్తున్నట్లు వెల్లడించారు. మలయాళంలో మోహన్ లాలా, తెలుగులో వెంకటేష్ యధావిధిగా కొనసాగుతున్నారు. `దృశ్యం` రెండు సినిమాలు రెండు భాషల్లోనూ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ నటించిన `దృశ్యం` మంచి సక్సెస్ అయింది.
ఈ నేపథ్యంలో `దృశ్యం 3`కి సంబంధించి తెరకెక్కించడం ఒకేసారి అన్ని భాషల్లో సాధ్యం కాకపోయినా రిలీజ్ మాత్రం ఒకేలా చేస్తామన్నారు. బాలీవుడ్ కి సంబంధించి తానే కథ అందిస్తున్నట్లు...కానీ ఆ కథను వాళ్ల నేటివిటీకి తగ్గట్టు మార్చుకుంటారని వెల్లడించారు. అయితే కోలీవుడ్ లో మాత్రం `దృశ్యం` రెండవ భాగం తెరకెక్కలేదు. `పాపనాశం` టైటిల్ తో తెరకెక్కిన మొదటి భాగంలో కమల్ హాసన్ నటించారు.
కానీ అక్కడ అంతగా సక్సస్ కాకపోడంతో కమల్ రెండవ భాగాన్ని లైట్ తీసుకున్నారు. తాజాగా కమల్ `దృశ్యం 3`ని తమిళ్ లో చేయాలనుకుంటున్నారుట. దీనికి సంబంధించి కమల్ జీతు జోసెఫ్ తో సమావేశ మైనట్లు కోలీవుడ్ లో వార్తలొస్తున్నాయి. ఆయన కూడా పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. అదే జరిగితే దృశ్యం క్రేజ్ ఇంకా రెట్టింపు అవుతుంది. ప్రధాన భాషలన్నింటిలోనూ దృశ్యం -3 రిలీజ్ అవుతున్నట్లే.
