కమల్ ‘హాట్’ సీన్లపై హాట్ డిస్కషన్
ఇప్పుడంటే సౌత్ సినిమాల్లో లిప్ లాక్ సీన్లు చాలా కామన్ అయిపోయాయి కానీ.. 20 ఏళ్ల ముందు డైరెక్ట్ కిస్‌లు చాలా అరుదు.
By: Tupaki Desk | 19 May 2025 8:00 AM ISTఇప్పుడంటే సౌత్ సినిమాల్లో లిప్ లాక్ సీన్లు చాలా కామన్ అయిపోయాయి కానీ.. 20 ఏళ్ల ముందు డైరెక్ట్ కిస్‌లు చాలా అరుదు. ముద్దు సీన్ అంటే.. హీరో హీరోయిన్ల పెదవులు దగ్గరవుతున్నట్లు చూపించడం.. కట్ చేస్తే ముద్దు పెట్టుకుని ఇద్దరూ సిగ్గుపడుతున్నట్లు చూపించడం.. ఇదీ వరస. కానీ అలాంటి రోజుల్లో కమల్ హాసన్ సినిమాల్లో మాత్రం ఘాటైన పెదవి ముద్దులు ఉండేవి. బాలీవుడ్ సినిమాలను మించి.. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఆయన లిప్ లాక్ సీన్లు చేసేవారు. ‘హే రామ్’ లాంటి సినిమాల్లో ఆయన లిప్ లాక్ సీన్లు వివాదాస్పదం అయ్యాయి కూడా.
కానీ గత కొన్నేళ్లలో మాత్రం కమల్ వీటికి దూరంగా ఉంటున్నారు. వయసు పెరిగిన రీత్యా మిడిలేజ్డ్ పాత్రలు చేస్తూ.. వాటికి తగ్గట్లు హుందాగా కనిపిస్తున్నారు. ‘విశ్వరూపం’ తర్వాత ఆయన లిప్ లాక్ సీన్స్ చేయలేదు. కానీ 70 ఏళ్ల వయసులో ఇప్పుడు ఆయన ఘాటైన పెదవి ముద్దుతో అందరికీ పెద్ద షాకే ఇచ్చారు. నిన్న రిలీజైన కమల్ కొత్త చిత్రం ‘థగ్ లైఫ్’ ట్రైలర్లో ఒక చిన్న షాట్ హాట్ టాపిక్‌గా మారింది. అందులో తనకు జోడీగా నటించిన అభిరామితో ఆయన ఘాటైన లిప్ లాక్ చేసేవారు. రెప్పపాటు వ్యవధిలో అయిపోయినా సరే.. ఈ షాట్ చర్చనీయాంశంగా మారింది.
70 ఏళ్ల వయసులో 45 ఏళ్ల వయసున్న అభిరామితో ఈ ఘాటు రొమాన్స్ ఏంటి అంటూ కమల్ మీద నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తున్నారు. కమల్ ఇంకా మారలేదని.. ఆయనలో ఇంకా సరసం తగ్గలేదని.. కామెంట్లు చేస్తున్నారు. గతంలో ‘విరుమాండి’ చిత్రంలో అభిరామితో కొన్ని హాట్ సీన్లు చేశారు కమల్. ఆ సినిమా వచ్చి 22 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు మళ్లీ అదే నటితో ఇలాంటి సీన్ చేయడం ఆశ్చర్యకరమే. మరోవైపు త్రిషతో కూడా కమల్ రొమాన్స్ చేస్తూ కనిపించడం ఇంకో షాక్. ఈ సినిమాలో త్రిష.. శింబుకు జోడీ అని అంతా అనుకున్నారు. కానీ అతడికి హీరోయినే లేకుండా చేసి.. కమల్‌కు ఈ వయసులో ఇద్దరు హీరోయిన్లను పెట్టి, ఆ ఇద్దరితోనూ రొమాంటిక్ సీన్లు పెట్టడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.
