Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ హాస‌న్‌కు ద‌క్కిన‌ ఆస్కార్ గౌర‌వం

వ‌చ్చే ఏడాది మార్చిలో ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం అట్ట‌హాసంగా జ‌ర‌గ‌బోతోంది.

By:  Tupaki Desk   |   27 Jun 2025 10:50 AM IST
క‌మ‌ల్ హాస‌న్‌కు ద‌క్కిన‌ ఆస్కార్ గౌర‌వం
X

వ‌చ్చే ఏడాది మార్చిలో ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం అట్ట‌హాసంగా జ‌ర‌గ‌బోతోంది. దీని కోసం నిర్వాహ‌కులు ఇప్ప‌టికే ఏర్పాట్లు చేయ‌డం మొద‌లు పెట్టారు. ఇందులో భాగంగా ఓటింగ్ ప్ర‌క్రియ కోసం క‌మిటీని ఫైన‌ల్ చేసింది. ఇందులో భార‌తీయ న‌టులు క‌మ‌ల్ హాస‌న్‌, ఆయుష్మాన్ ఖురానా చోటు ద‌క్కించుకున్నారు. వీరిద్ద‌రు గ్లోబ‌ల్ క్ల‌బ్‌లో చోటు ద‌క్కించుకోవ‌డం విశేషం. ఇందులో భాగంగానే వీరిద్ద‌రికి ఆస్కార్ అకాడ‌మీలోకి ఆహ్వానం ల‌భించింది. ఎంతో మంది హాలీవుడ్ న‌టీన‌టుల‌తో పాటు ఆస్కార్ ఓటింగ్ ప్ర‌క్రియ‌లో మ‌న న‌టులు భాగం అయ్యారు.

ఈ ఏడాది ఆస్కార్ అకాడ‌మీ క‌మిటీలో చోటు పొందిన వారి జాబితాను ది అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా విడుద‌ల చేసింది. ఇందులో న‌టులు క‌మ‌ల్‌హాస‌న్‌, ఆయుష్మాన్ ఖురానాతో పాటు ద‌ర్శ‌కురాలు పాయ‌ల్ క‌పాడియా, భార‌తీయ ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ్యాక్సిమా బ‌సు కూడా ఉన్నారు. ఆస్కార్‌కు నామినేట్ అయ్యే చిత్రాల్లో ఫైన‌ల్ ఎంపిక ప్ర‌క్రియ‌లో వీరికి ఓటు వేసే అవ‌కాశాన్ని ఆస్కార్ అకాడ‌మీ క‌ల్పించింది.

ఈ ఏడాది కొత్త‌గా 534 మంది స‌భ్యుల‌ను ఈ పుర‌స్కారాల‌కు ఆస్వానించిన‌ట్టు అకాడ‌మీ తెలిపింది. ప్ర‌తిభావంతులైన వీరికి అకాడ‌మీలో చోటు క‌ల్పించ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని పేర్కొంది. 19 ఇత‌ర విభాగాల్లోని న‌టులు, ద‌ర్శ‌కులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత‌ల‌ను అకాడ‌మీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆహ్వానించింది. ఈ సంవ‌త్సం చోటు ద‌క్కించుకున్న 534 మందిలో 44 శాతం మ‌హిళ‌లే ఉన్న‌ట్టుగా తెలిపింది. ఇక వ‌చ్చే ఏడాది మార్చి 15న ఆస్కార్ అవార్డుల వేడుక జ‌రుగ‌నుంది.

ఇందు కోసం జ‌న‌వ‌రి 12 నుంచి 16 వ‌ర‌కు నామినేష‌న్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. ప‌రిశీల‌న త‌రువాత తుది జాబితాను జ‌న‌వ‌రి 22న ప్ర‌క‌టించ‌నున్నారు. 2025కి గానూ అట్ట‌హాసంగా జ‌ర‌గ‌నున్న ఈ అవార్డుల కోసం క్రేజీ సినిమాలు భారీ స్థాయిలో పోటీప‌డ‌బోతున్నాయి.