చెంగారెడ్డిని చూసి అసూయ పడిన విశ్వనటుడు!
వచ్చే నెల 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అవుతుండడం తెలిసిందే. రిలీజ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం చెన్నైలో చిత్ర ఆడియో లాంచ్ను నిర్వహించింది.
By: Tupaki Desk | 26 May 2025 11:18 AM ISTలోకనాయకుడు కమల్‌హసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో 38 ఏళ్ల క్రితం వచ్చిన నాయకన్ సినిమా అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా థగ్ లైఫ్. వచ్చే నెల 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అవుతుండడం తెలిసిందే. రిలీజ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం చెన్నైలో చిత్ర ఆడియో లాంచ్ను నిర్వహించింది.
ఈ ఆడియో ఫంక్షన్‌లో కమల్‌హాసన్, జోజూ జార్జ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు ఇరట్ట సినిమాకు ముందు వరకు జోజూ జార్జ్ గురించి పెద్దగా తెలియదని, ఆ మూవీ చూశాక అతడి నటన చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. ఆ సినిమాలో జోజూ ఎప్పటికి గుర్తుండిపోయే పాత్ర పోషించారని ప్రశంసించాడు. కొందరి నటన చూసి తాను అసూయపడే వారిలో జోజూ కూడా ఒకరని అన్నారు. జోజుకి మంచి భవిష్యత్ ఉందని ఆకాంక్షించాడు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి భవిష్యత్‌లో ఉన్నత స్థానాలను అధిరోహించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని కొనియాడాడు.
సినిమా అనే దానికి తానొక వీరాభిమాని అని.. అదే సినిమా తనని, మణిరత్నంను మరోసారి దగ్గర చేసిందని కమల్‌హాసన్ తెలిపాడు. నాయకన్ కంటే థగ్ లైఫ్ చిత్రం పెద్ద హిట్ అవుతుందని చెప్పాడు. ఇక థగ్ లైఫ్ మూవీ గురించి మాట్లాడాలంటే ముందు ఏఆర్ రెహమాన్ గురించి చెప్పాల్సిందే అన్నాడు. సంగీతంలో ఇళయరాజా తర్వాత తనను ఆస్థాయిలో ఆకట్టుకుంది రెహమాన్ అని ఆకాశానికెత్తాడు. వీరిద్దరూ తమ సంగీతంతో దక్షిణ భారతదేశం గర్వించేలా చేశారని ప్రశంసల వర్షం కురిపించాడు.
ఈ సినిమాలో హీరో శింబు, త్రిషా అద్భుతమైన పాత్రలు పోషించారని అన్నాడు. శింబు భవిష్యత్‌లో ఇతరులకు మార్గదర్శనం చేసే ఒక నాయకుడిగా ఎదుగుతాడని కమల్ జోస్యం చెప్పాడు. త్రిష చూడ్డానికి మాత్రమే అందగత్తె కాదని, ఆమె మనకు కూడా చాలా గొప్పదని పొగడ్తలు కురిపించాడు. మరో నటి అభిరామి కూడా ఈ సినిమాలో బలమైన పాత్ర పోషించారని తెలిపాడు. శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఎన్. సుధాకర్ రెడ్డి రిలీజ్ చేస్తున్న ఈ సినిమా విజయంపై కమల్ హాసన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
