రెండు రిలీజ్ ల మధ్య 8 వారాలు గ్యాప్ తప్పనిసరి!
ఇప్పటికే ఈ అంశంపై చాలా మంది ఎవరి అభిప్రాయాలు వారు తెలియజేసారు. తాజాగా విశ్వ నటుడు కమల్ హాసన్ కూడా ఎనిమిది వారాల గ్యాప్ తప్పనిసరిగా భావించారు.
By: Tupaki Desk | 22 May 2025 10:30 AM ISTథియేట్రికల్-ఓటీటీ రిలీజ్ మధ్య ఎనిమిది వారాలు తప్పనిసరిగా గ్యాప్ ఉండాలి? అన్నది ఓటీటీ రూల్. కానీ చాలా ఓటీటీలు ఆ రూల్ ని బ్రేక్ చేసి చిత్రాలను రిలీజ్ చేస్తున్నాయి. సినిమా హిట్ అయితే కండీషన్ బాగానే ఫాలో అవుతున్నాయి ఓటీటీలు. లేకపోతే బ్రేక్ తప్పడం లేదు. సినిమా ప్లాప్ అయితే థియేట్రికల్ రిలీజ్ అనంతరం రెండు వారాల గ్యాప్ లోనే ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఇంకా అంతకంటే ముందే రిలీజ్ అవుతున్నాయి.
దీంతో థియేటర్ కి వెళ్లాలి అన్న ప్రేక్షకుల ఆలోచన కూడా మారిపోతుంది. పెద్ద సినిమా సక్సెస్ అయితే ఎలాగూ థియేటర్ కి వెళ్లి చూస్తున్నారు. అందులో ఇబ్బంది లేదు. కానీ చిన్న సినిమా విషయంలో రూల్స్ బ్రేక్ చేయడంతో థియేట్రికల్ గా నిర్మాతలు మరింత నష్టపోవాల్సి వస్తోంది అన్న విమర్శ కూడా ఓటీటీ పై ఉంది. ఇప్పటికే ఈ అంశంపై చాలా మంది ఎవరి అభిప్రాయాలు వారు తెలియజేసారు. తాజాగా విశ్వ నటుడు కమల్ హాసన్ కూడా ఎనిమిది వారాల గ్యాప్ తప్పనిసరిగా భావించారు.
కమల్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో 'థగ్ లైఫ్' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. జూన్ లో సినిమా రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో కమల్ వ్యక్తిగత ఒప్పందం చేసుకున్నారు. తప్పకుండా ఎనిమిది వారాల తర్వాతే రిలీజ్ చేయాలని..కుదిరితే ఇంకా ఆ సమయం పెంచాలన్నట్లు మాట్లాడారు. దీనికి నెట్ ప్లిక్స్ కూడా అంగీకరించినట్లు తెలిపారు. సినిమా పరిశ్రమ ఆరోగ్యంగా ఉండాలంటే ఇంత గ్యాప్ తోనే సాధ్యమవుతుందన్నారు.
ఇష్టారీతున ఓటీటీ రిలీజ్ లు జరిగితే నష్టపోయేది పరిశ్రమ, నిర్మాతలని కమల్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే థియేటర్ కు వచ్చే ఆడియన్స్ కూడా తగ్గారు. వాళ్లను థియేటర్ కు రప్పించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఓటీటీతో సంబంధం లేకుండా సగటు ప్రేక్షకుడు థియేటర్ వచ్చి సినిమా చూసేలా చేసే బాద్యత పరిశ్రమలో ఉన్న అందరిపైనా ఉందన్నారు.
