లిప్ లాక్ పై జడ్జిమెంట్ కి సిద్దమేనా?
`థగ్ లైప్` లో కమల్ హాసన్ -అభిరామి మధ్య లిప్ లాక్ సీన్ ఎంతటి వివాదాస్పదమైందో తెలిసిందే.
By: Tupaki Desk | 5 Jun 2025 8:54 PM IST`థగ్ లైప్` లో కమల్ హాసన్ -అభిరామి మధ్య లిప్ లాక్ సీన్ ఎంతటి వివాదాస్పదమైందో తెలిసిందే. 40 ఏళ్ల నటితో 70 ఏళ్ల కమల్ హాసన్ లిప్ లాక్ ఏంటి? అని కమల్ పై కత్తికి లేని దురద కందకు ఎందుకు అన్నట్లు విరుచుకుపడ్డారు. సహజంగానే మణిరత్నం సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలుంటాయి. అలాగని అవి హద్దు మీరి ఉండవు. సీన్ డిమాండ్ చేసిన సందర్భంలో అలాంటి ఛాన్స్ తీసుకుంటారు.
ఈ వివాదంపై కమల్ ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే అభిరామి మాత్రం వివరణ ఇచ్చే ప్రయత్నం ఇప్పటికే చేసింది. కేవలం 3 సెకన్ల ముద్దు మాత్రమే అని అందులో అసభ్యత కానీ అశ్లీలత కానీ ఏమీ లేదంది. చిత్రనిర్మాతల నిర్ణయాలను ఎల్లప్పుడూ గౌరవిస్తాననన్నారు. దీనిపై అనవసరమైన రాద్దాంతం అవసరం లేదని కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి స్పందించింది.
`ఈ పాత్రకు నన్ను ఎందుకు తీసుకున్నారు అని మణిరత్నంని అడిగాను. వాళ్లను ఎప్పుడు గౌరవిస్తాను. నా పూర్తి అంగీకారంతోనే ముద్దు సన్నివేశంలో నటించాను. ఆ సీన్ కేవలం మూడు షాట్స్ లో పూర్తి చేసాం. ఆ షాట్ పై ఎన్నో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల నిర్ణయాలు మారతాయిని నమ్ముతున్నాను. సినిమా రిలీజ్ తర్వాత ఈ టాపిక్ ఇంకెవరి మధ్య రాదనుకుంటున్నాను.
దీని మీద ఎవరైనా జడ్జిమెంట్ ఇవ్వాలనుకుంటే సినిమా చూసొచ్చిన తర్వాత నిరభ్యంతరంగా ఇవ్వొచ్చు` అని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. థగ్ లైఫ్ నేడు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరి ఆ లిప్ లాక్ సీన్ పై నెటి జనులు మళ్లీ చర్చకు తెర తీస్తారా? అన్నది చూడాలి.
