Begin typing your search above and press return to search.

'నాగార్జున' హిట్ బ్యానర్ కమ్ బ్యాక్.. అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు..

టాలీవుడ్ లో అనేక నిర్మాణ సంస్థలు ఉన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ఆయా సంస్థలు మూవీస్ నిర్మిస్తూనే ఉంటాయి.

By:  Tupaki Desk   |   8 Jun 2025 1:00 AM IST
నాగార్జున హిట్ బ్యానర్ కమ్ బ్యాక్.. అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు..
X

టాలీవుడ్ లో అనేక నిర్మాణ సంస్థలు ఉన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ఆయా సంస్థలు మూవీస్ నిర్మిస్తూనే ఉంటాయి. కొన్ని బ్యానర్స్ మాత్రం కొంతకాలం పాటు బ్రేక్ తీసుకుని మళ్లీ ఇప్పుడు కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు కామాక్షి మూవీస్ సంస్థ కూడా అదే కోవకు చెందుతుంది.

1985లో కామాక్షి మూవీస్ బ్యానర్‌ ను దివంగత శివప్రసాద్ రెడ్డి స్థాపించారు. 1986 నుంచి 2013 వరకు ఎన్నో సినిమాలను కామాక్షి మూవీస్ బ్యానర్ పై శివప్రసాద్ రెడ్డి నిర్మించి పలు హిట్స్ ను అందుకున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా ఏకంగా 12 సినిమాలు చేశారు. వాటిలో వివిధ చిత్రాలు సక్సెస్ ను అందుకున్నాయి.

అయితే ఆ బ్యానర్ శివప్రసాద్ రెడ్డి ది కాదని.. నాగార్జునదేనని అప్పట్లో అందరూ అనుకునేవారు. కానీ అది నిజం కాదు. కింగ్ తో ఉన్న స్నేహం వల్ల ఆయనతోనే ఎప్పుడూ ఉండేవారు. ఆయనే హీరోగా ఎక్కువ సినిమాలు చేశారు. కొంత కాలం తర్వాత నాగార్జున ఆఫీసర్ మూవీ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు కూడా చూసుకున్నారు.

అదే సమయంలో పలు సినిమాల వల్ల ద్వారా శివప్రసాద్ రెడ్డి నష్టపోయారు. దీంతో సినిమాలను నిర్మించడం ఆపేశారు. అక్కడికి కొన్ని రోజుల తర్వాత ఆయన కన్నుమూశారు. హృదయ సంబంధిత సమస్యతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో మరణించారు. సర్జరీ చేయించుకున్న తర్వాత కోలుకోక తుదిశ్వాస విడిచారు.

ఇప్పుడు ఆయన కుమారుడు చందన్ రెడ్డి.. మళ్లీ తన తండ్రి స్థాపించిన కామాక్షి మూవీస్ బ్యానర్ ను రీస్టార్ట్ చేశారు. వరుస సినిమాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. మరో నిర్మాత వివేక్ కూచిభొట్లతో చేతులు కలిపి.. పలు సినిమాలు నిర్మించనున్నారు.

యంగ్ హీరోలు సాయిధరమ్ తేజ్ తో ఓ మూవీ.. కిరణ్ అబ్బవరంతో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు చందన్ రెడ్డి. త్వరలో ఆ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన అనౌన్స్మెంట్లు ఇవ్వనున్నారట. అయితే టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, చందన్ రెడ్డి చాలా క్లోజ్ అంట. అందుకే ఆయనతో ఓ మూవీ ప్లాన్ చేయాలని చందన్ యోచిస్తున్నట్లు సమాచారం. మరి చందన్ రెడ్డి.. ఎలాంటి సినిమాలు నిర్మిస్తారో వేచి చూడాలి.