Begin typing your search above and press return to search.

టిల్లు క్యూబ్.. డైరెక్టర్ ఛేంజ్.. ఎవరంటే?

మ్యాడ్ మూవీ దర్శకుడు కళ్యాణ్ శంకర్ టిల్లు క్యూబ్ ను తెరకెక్కించనున్నారని ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   22 April 2024 5:24 AM GMT
టిల్లు క్యూబ్.. డైరెక్టర్ ఛేంజ్.. ఎవరంటే?
X

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ.. సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నా డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయం సాధించి సిద్ధులో ఫుల్ జోష్ నింపింది. డీజే టిల్లు క్యారెక్టర్.. సినీ ప్రియులకు బాగా నచ్చేసింది. సిద్ధు కామెడీ టైమింగ్, యాక్టింగ్, డైలాగులకు ఫిదా అయిపోయారు.

ఇటీవల ఈ సినిమా సీక్వెల్ టిల్లు స్క్వేర్ రిలీజైన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ కన్నా కూడా భారీ విజయం సాధించింది. సిద్ధు మరోసారి తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించారు. హీరోయిన్ అనుపమ యాక్టింగ్, రాధిక ఎంట్రీ.. అలా అన్నీ క్లిక్ అవ్వడంతో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో మేకర్స్.. టిల్లు స్క్వేర్ సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు.

ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గురించే చర్చ నడుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టిల్లు క్యూబ్ గురించి మాట్లాడారు సిద్ధు. టిల్లు సూపర్ హీరో అయితే ఎలా ఉంటుందనే పాయింట్ చుట్టూ సినిమా తిరుగుతోందని వెల్లడించారు. ఆ స్క్రిప్ట్ వర్క్ త్వరలో మొదలుపెడతానని చెప్పారు. దీంతో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. అయితే టిల్లు క్యూబ్ డైరెక్టర్ ఎవరనేది మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

ఫస్ట్ పార్ట్ ను విమల్ కృష్ణ తెరకెక్కించగా.. రెండో భాగాన్ని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు టిల్లు క్యూబ్ ను మరో డైరెక్టర్ తీయనున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మ్యాడ్ మూవీ దర్శకుడు కళ్యాణ్ శంకర్ టిల్లు క్యూబ్ ను తెరకెక్కించనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మ్యాడ్ స్క్వేర్ వర్క్ లో బిజీగా ఉన్నారు కళ్యాణ్ శంకర్. ఇటీవల ఈ సినిమా షూటింగ్ మొదలైనట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది.

అయితే టిల్లు స్క్వేర్ కు డైలాగ్స్ అందించారు కళ్యాణ్ శంకర్. సెకండాఫ్ లో కొన్ని పంచ్ డైలాగ్స్ ఆయన రాసినవేనని టాక్. సిద్ధుకు బిగ్ హెల్ప్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. మ్యాడ్ సీక్వెల్ అయ్యాక టిల్లు క్యూబ్ షూటింగ్ ను కళ్యాణ్ శంకర్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. టిల్లు క్యూబ్ కోసం డైరెక్టర్ నే కాదు.. హీరోయిన్ కూడా మార్చేశారట మేకర్స్. మొత్తానికి మూడు చిత్రాలకు వేర్వేరు డైరెక్టర్లు, వేర్వేరు హీరోయిన్లు. మరి టిల్లు క్యూబ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.