Begin typing your search above and press return to search.

కళ్యాణ్ రామ్.. మరో దర్శకుడు తప్పుకున్నట్లే..

బింబిసార2 అయితే ఉంటుంది కానీ ఎవరు డైరెక్షన్ చేస్తారనేది తనకి తెలియదని వశిష్ఠ క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   20 Jan 2024 4:30 PM GMT
కళ్యాణ్ రామ్.. మరో దర్శకుడు తప్పుకున్నట్లే..
X

కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన మూవీ బింబిసార. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. అయితే మళ్ళీ ఎందుకో సౌండ్ లేకుండా పోయింది. ఇప్పుడు వశిష్ఠ మల్లిడి మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర మూవీ చేస్తున్నారు.

పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయిపొయింది. ఇదిలా ఉంటే వశిష్ఠ మల్లిడి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకి స్కూల్ డేస్ లో వచ్చిన ఆలోచనని కాస్తా బెటర్ చేసి విశ్వంభర మూవీ చేస్తున్నట్లు చెప్పారు.

అలాగే బింబిసార తర్వాత సీక్వెల్ కూడా స్టార్ట్ చేయాలని అనుకున్నాం. అది మొదలైన తర్వాత కాస్తా క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఆ ప్రాజెక్ట్ నుంచి నేను బయటకి వచ్చేశాను. బింబిసార2 అయితే ఉంటుంది కానీ ఎవరు డైరెక్షన్ చేస్తారనేది తనకి తెలియదని వశిష్ఠ క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా డెవిల్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన కళ్యాణ్ రామ్ త్వరలో బింబిసార 2 స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

పాన్ ఇండియా లెవల్ లో గ్రాండ్ స్కెల్ పైన ఈ చిత్రం ఉంటుందని కూడా స్పష్టం చేశారు. అయితే ఎవరు దర్శకత్వం చేస్తారనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బింబిసార హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా వచ్చే మూవీపైన ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉంటాయి. డెవిల్ మూవీ పీరియాడిక్ జోనర్ లో హై వోల్టేజ్ యాక్షన్ కథతో చేసిన డిజాస్టర్ అయ్యింది.

మరి కళ్యాణ్ రామ్ కి బింబిసార2 ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది చూడాలి. మరో వైపు వశిష్ఠ మల్లిడి ఐతే మెగాస్టార్ చిరంజీవితో చేస్తోన్న విశ్వంభర మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి తేవాలని అనుకుంటున్నారు.