Begin typing your search above and press return to search.

రెండు ప‌వ‌డ‌ల ప్ర‌యాణం అప్పుడే వ‌ద్ద‌నుకున్నా!

తాజాగా ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా ఆయ‌న న‌టుడిగా..నిర్మాత‌గా ఆయ‌న జ‌ర్నీ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. రెండు ర‌కాలుగానూ రాణిస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 Dec 2023 5:34 AM GMT
రెండు ప‌వ‌డ‌ల ప్ర‌యాణం అప్పుడే వ‌ద్ద‌నుకున్నా!
X

నంద‌మూరి వార‌సుడు క‌ళ్యాణ్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. 'బింబిసార' విజ‌యంతో ఆయ‌న స్టార్ డ‌మ్ అంత‌కంత‌కు రెట్టింపు అయింది. మ‌ధ్య‌లో 'అమిగోస్' లాంటి డిఫ‌రెంట్ ప్ర‌య‌త్నం కాస్త నిరాశ ప‌రిచినా ఆప్ర‌భావం అత‌నిపై పెద్ద‌గా చూపించ‌లేదు. ప్ర‌స్తుతం స్పై బ్యాక్ డ్రాప్ లో 'డెవిల్' సినిమా చేస్తున్నాడు. ఇందులో బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్ర‌లో మెప్పించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే స్పై నేప‌థ్యం గ‌ల సినిమాలో పాన్ ఇండియాలో సంచ‌ల‌న విజ‌యం సాధిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో 'డెవిల్' పైనా అంచ‌నాలు స్కైని ట‌చ్ చేస్తున్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాకు మంచి బ‌జ్ ని తీసుకొచ్చాయి. క‌ళ్యాణ్ రామ్ లుక్ ప్ర‌తీది డెవిల్ మార్కెట్ లోకి ప్ర‌త్యేకంగా హైలైట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా ఆయ‌న న‌టుడిగా..నిర్మాత‌గా ఆయ‌న జ‌ర్నీ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. రెండు ర‌కాలుగానూ రాణిస్తున్నారు.

ఓ క‌థ‌ని ఎంపిక చేసుకునే విష‌యంలో ఏ కోణం నుంచి ఎక్కువ‌గా ఆలోచిస్తారు? అంటే ఆస‌క్తిర స‌మాధానం ఇచ్చారు. ఓం చిత్రం త‌ర్వాత నాలో చాలా క్లారిటీ వ‌చ్చింది. న‌టుడిగా..నిర్మాత‌గా ఒకేసారి రెండు ప‌డ‌వ‌ల మీద ప్ర‌యాణం చేయ‌కూడ‌దు అని తెలుసుకున్నా. ఎందుకంటే న‌ట‌న‌లో ఎంత క‌ష్ట‌ప‌డాలో నిర్మాత‌గా అంత‌కు మించి ప‌నిచేయాల్సి ఉంటుంది. అన్ని శాఖ‌ల్ని..అంద‌ర్నీ స‌మ‌న్వ‌యం చేసుకుంటూ వెళ్లాలి.

అదే న‌ట‌న అయితే ఆ ప‌నిమీద దృష్టి పెడితే స‌రిపోతుంది. హీరోగా చేసిన‌ప్పుడు నటుడిగానే ఆలోచిస్తాం. అందుకే రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం వ‌ద్ద‌నుకున్నా. ఇక మా బ్యాన‌ర్ లో సినిమాల విష‌యానికి వ‌స్తే క‌థ‌లు వింటాను. కానీ మిగిలిన ఏ ప‌నిలోనూ నేను క‌ల్పించుకోను. నిర్మాణానికి సంబంధించిన ప‌నుల‌న్నీ మా హ‌రికృష్ణ ద‌గ్గ‌రుండి చూసుకుంటారు. వాటితో నాకెలాంటి సంబంధం లేకుండా ఉంటాను' అని అన్నారు. 'ఓం 'చిత్రాన్ని క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తూ..భారీ బ‌డ్జెట్ తో త్రీడీలో రూపొందించారు. టాలీవుడ్ లో రిలీజ్ అయిన తొలి త్రీడి సినిమా అదే. ఆయ‌న ప్ర‌యోగం చేసిన త‌ర్వాతే మిగ‌తా సినిమాలు త్రీడీలో రిలీజ్ అయ్యాయి.