Begin typing your search above and press return to search.

తమిళ స్టార్ తో కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్..!

కళ్యాణ్ రామ్ కోసం పవన్ సాధినేని ఒక కథను సిద్ధం చేశారు. అందులో హరికృష్ణకి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అనుకున్నారు. ఆ ప్రాజెక్ట్ లేట్ అవడం కాంబో సినిమా కుదరలేదు.

By:  Tupaki Desk   |   13 Dec 2023 2:22 PM GMT
తమిళ స్టార్ తో కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్..!
X

కొన్ని కాంబినేషన్స్ చాలా ఏళ్లుగా డిస్కషన్స్ లో ఉన్నా సరైన టైం వచ్చే దాకా సినిమా చేయడం కుదరదు. కొన్నాళ్ల క్రితమే నందమూరి హీరో కళ్యాణ్ రామ్ పవన్ సాధినేని డైరెక్షన్ లో సినిమా ఉంటుందని అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. ప్రేమ ఇష్క్ కాదల్ తో డైరెక్టర్ గా పరిచయమైన పవన్ సాధినేని ఫస్ట్ సినిమాతో డైరెక్టర్ గా తన మార్క్ చూపించాడు.

ఆ తర్వాత సినిమాలు చేసినా అవి అంతగా ప్రేక్షకుల మెప్పు పొందలేదు. ఈమధ్య వెబ్ సీరీస్ లతో అతని సత్తా చాటుతున్నాడు పవన్ సాధినేని. సేనాపతి తో ప్రతిభ చూపి దత్య వెబ్ సీరీస్ తో ఆడియన్స్ ని అలరించారు పవన్ సాధినేని. వెబ్ సీరీస్ లతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన పవన్ సాధినేని వరుస ఛాన్స్ లు వస్తున్నాయి. లేటెస్ట్ గా కళ్యాణ్ రాం తో పవన్ సాధినేని సినిమా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అసలైతే నాలుగేళ్ల క్రితమే ఈ కాంబో సినిమా రావాల్సి ఉంది. కానీ ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వీరి కాంబో సెట్ రైట్ అవుతుంది.

కళ్యాణ్ రామ్ కోసం పవన్ సాధినేని ఒక కథను సిద్ధం చేశారు. అందులో హరికృష్ణకి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అనుకున్నారు. ఆ ప్రాజెక్ట్ లేట్ అవడం కాంబో సినిమా కుదరలేదు. అయితే ఇప్పుడు అదే కథతో ఈ సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. హరికృష్ణ కోసం అనుకున్న ఆ పాత్రను కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. తమిళ సినిమాలు చేస్తున్నా సరే విజయ్ సేతుపతికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సైరా నరసింహారెడ్డి లో కూడా చిన్న పాత్రలో మెప్పించారు.

ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో సినిమాకు రెడీ అవుతున్నారు. క్రేజీ మల్టీస్టారర్ గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ సాధినేని కళ్యాణ్ రామ్ విజయ్ సేతుపతి ఈ కాంబినేషన్ సినిమా ఆడియన్స్ కు అదిరిపోయే ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. ఈ సినిమాను డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. ఇదివరకు ఖైదీ, ఒకే ఒక జీవితం, జపాన్ సినిమాలు ఈ నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. త్వరలో డెవిల్ గా రాబోతున్న కళ్యాణ్ రామ్ వరుస సినిమాలు చేయాలని చూస్తున్నారు.