Begin typing your search above and press return to search.

దేవరలో కళ్యాణ్ రామ్.. ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్..!

ఇక ఈమధ్యనే డెవిల్ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో తారక్ దేవర నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని

By:  Tupaki Desk   |   1 Jan 2024 2:45 AM GMT
దేవరలో కళ్యాణ్ రామ్.. ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్..!
X

ఆర్.ఆర్.ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో రాబోతున్నాడు. యువ సుధ ఆర్ట్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను డైర్కెటర్ కొరటాల శివ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. దేవర సినిమా మొదట ఒక సినిమాగా రిలీజ్ చేయాలని అనుకున్నా సినిమా కథ.. పాత్రలు ఎమోషనల్ కనెక్షన్ బాగా వస్తుండటం వల్ల సినిమాను రెండు భాగాలుగా చెప్పాలని ఫిక్స్ అయ్యారు. దేవర 1 2024 ఏప్రిల్ 5న రిలీజ్ లాక్ చేశారు.

ఇక ఈమధ్యనే డెవిల్ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో తారక్ దేవర నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని. సినిమాపై మీరు ఎన్ని అంచనాలతో వచ్చినా వాటికి మించి సినిమా ఉంటుందని దేవర నిర్మాతల్లో ఒకరైన కళ్యాణ్ రామ్ అన్నారు. కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్స్ పై ఫ్యాన్స్ అంతా దేవర మీద ఇంకాస్త అంచనాలు పెంచుకున్నారు. అయితే దేవర సినిమా నుంచి ఒక ఎక్స్ క్లూజివ్ న్యూస్ లీక్ అయ్యింది.

దేవర సినిమాలో ఎన్టీఆర్ తో పాటుగా నందమూరి కళ్యాణ్ రామ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ చాలా సీక్రెట్ గా ఉంచాలని చూశారు. కానీ స్టార్ సినిమా అంటే ఎలాంటి అప్డేట్ అయినా ముందు లీక్ అవ్వడం ఖాయం. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ దేవరలో ఉంటున్నాడన్న విషయం కూడా లీక్ అయ్యింది.

దేవర అప్డేట్ ఇచ్చినా సరే తను నటిస్తున్నానన్న విషయాన్ని కళ్యాణ్ రామ్ చెప్పలేదు. కానీ దేవర టీం నుంచి ఈ లీక్ బయటకు వచ్చింది. సినిమాలో సరైన టైం లో కళ్యాణ్ రామ్ కేమియో ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు. కొరటాల శివ ఈ సినిమాతో తనలో ఉన్న కమర్షియల్ డైరెక్టర్ ని కూడా ఆడియన్స్ కు పరిచయం చేయబోతున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని తెలుస్తుంది.

దేవర కోసం తారక్ చాలా కష్టపడుతున్నాడని చెబుతున్నారు. సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్ లో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నారు ఎన్టీఆర్. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా నందమూరి ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉండేలా కొరటాల శివ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా టీజర్ సంక్రాంతికి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.